బాహుబలి సినిమాతో ప్రముఖ దర్శకుడు రాజమౌళి క్రేజ్ ఎక్కడికో వెళ్ళింది. అగ్ర హీరోలు ఇప్పుడు ఆయనతో ఒక్క సినిమా చేసినా చాలు అనుకునే స్థాయికి రాజమౌళి వెళ్ళారు అనే మాట వాస్తవం. ప్రస్తుతం ఆయన ఆర్ఆర్ఆర్ ని హాలీవుడ్ లో ప్రమోషన్ చేసేందుకు కష్టపడుతున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించి వరుసగా అంతర్జాతీయ అవార్డులు వస్తున్నాయి. తాజాగా మరో అవార్డు వచ్చింది.
బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ పిక్చర్ కేటగిరీలో క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్ వచ్చింది ఈ సినిమాకు. అనంతరం రాజమౌళి మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసారు. ఆయనను ప్రోత్సహించిన వారి గురించి చెప్పారు. మా అమ్మ పేరు రాజనేంద్రి అని నాలోని టాలెంట్ ను గుర్తించి నేను సినిమా రంగం వైపు వెళ్ళే విధంగా చేసిన వ్యక్తి ఆమె అంటూ చెప్పుకొచ్చారు. మా వదిన శ్రీవల్లి నన్ను ఎప్పుడూ ప్రోత్సహిస్తూ ఉంటుందన్నారు ఆయన.
శ్రీవల్లి నాకు మరో అమ్మ అని రాజమౌళి చెప్పుకొచ్చారు. నా భార్య రమా రాజమౌళి నా సినిమాలకు ఫ్యాషన్ డిజైనర్ గా పని చేస్తుందనే విషయం అందరికీ తెలుసని అన్నారు. నిజ జీవితంలో కూడా నా డిజైనర్ రమ అని రాజమౌళి ఆయన తెలిపారు. తన కూతుళ్లు తన కోసం ఏం చేయకపోయినా వాళ్ల నవ్వు నాకు చాలని అన్నారు జక్కన్న. రాజమౌళి ప్రస్తుతం మహేష్ సినిమా కోసం బిజీగా వర్క్ చేస్తున్నారు.