తెలుగు పాప్ గాయని స్మిత ఇప్పుడు మంచి క్రేజ్ తో దూసుకుపోతున్నారు. ఆమె సోనిలో చేస్తున్న నిజం షో కి మంచి స్పందన వచ్చింది. సింగర్ గానే కాకుండా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ పలు సేవా కార్యక్రమాలను సైతం ఆమె చేస్తూ ఉంటారు. ప్రస్తుతం స్మిత సినిమాల్లో నటించే ఆలోచనలో ఉన్నారనే వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంచితే ఆమెకు తెలుగులో కొందరు హీరోలతో బంధుత్వం ఉంది.
అసలు ఏంటీ ఆ కథ అనేది ఒకసారి చూద్దాం. 2000ల్లో వచ్చిన హాయ్‌రబ్బా ఆల్బమ్ తో బాగా పాపులర్ అయిన స్మితకు… అల్లరి నరేష్ అలాగే నానీకి ఆమెకు బంధుత్వం ఉంది. స్మిత హాయ్ రబ్బ ఆల్బమ్ రిలీజ్ అయిన సరిగా ఏడాదికి అల్లరి నరేష్…. అల్లరి సినిమా ద్వారా టాలీవుడ్ లో అడుగు పెట్టాడు. అప్పటి నుంచి వీళ్ళు మంచి ఫ్రెండ్స్ గా ఉన్నారు. స్మితకు… అల్లరి నరేష్ తండ్రి ఈవీవీ అంటే చాలా గౌరవం.
ఇక అల్లరి నరేష్ భార్యకు స్మితకు బంధుత్వం ఉంది. ఆమె స్మిత కు కజిన్ అవుతుంది. అల్లరి నరేష్ కు స్మిత వదిన అవుతుంది. అలాగే స్మిత భర్త శశాంక్‌కు నానికి బంధుత్వం ఉంది. ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సుబ్బరాజుతో కూడా ఆమెకు మంచి స్నేహం ఉంది. స్మిత పాడుతా తీయగా ద్వారా వెలుగులోకి వచ్చారు. విజయవాడ నుంచి వచ్చిన ఆమెకు అప్పుడు ఎస్పీ బాలు మంచి సపోర్ట్ ఇచ్చారు.