సినిమా పరిశ్రమలో హీరోయిన్లను చిన్న చూపు చూస్తారు అనే కామెంట్స్ మనం వింటూనే ఉంటాం. అగ్ర హీరోల పక్కన చేసినా చిన్న హీరోల పక్కన చేసినా ఇదే పరిస్థితి ఉంటుంది. రెమ్యునరేషన్ విషయంలో, గౌరవం విషయంలో హీరోయిన్లకు అన్యాయం జరుగుతుందనే మాటలు వస్తూనే ఉంటాయి. ఒకప్పుడు హీరోయిన్లకు చాలా గౌరవం ఉండేది. క్రమంగా గౌరవం తగ్గుతూ వస్తుంది.
ఇతర భాషల హీరోయిన్లను తెలుగులోకి తీసుకొస్తూ ఉంటారు. ఎవరో ఒకరిద్దరికి మినహా పెద్దగా వారిని పట్టించుకునే అవకాశం ఉండదు. ఇప్పుడు శ్రీలీల విషయంలో ఇదే జరుగుతుంది అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. శ్రీలీల ఈ మధ్య కాలంలో మంచి హిట్ లు అందుకుని దూసుకుపోతుంది. రవితేజాతో చేసిన ధమాకా సినిమా బాగా హిట్ అయింది. దీనితో ఆమెకు క్రేజ్ పెరుగుతూ మంచి అవకాశాలు వస్తున్నాయి.
ఈ క్రమంలోనే మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ పక్కన కూడా అవకాశం వచ్చింది. జూనియర్ ఎన్టీఆర్ పక్కన కూడా నటించే అవకాశం ఉంది. దాదాపు ఆరు సినిమాలను ఆమె లైన్ లో పెట్టింది. అయితే ఆమె రెమ్యునరేషన్ మాత్రం చాలా తక్కువ అంటున్నారు. కోటి నుంచి కోటిన్నర వరకే ఉందని సమాచారం. పెంచాలని అడిగినా పెంచడం లేదని అంటున్నారు. వరుస హిట్ లు పడితే పెంచే అవకాశం ఉంటుంది అని సమాచారం.