తెలుగులో యాంకర్ అనగానే ముందు మన కళ్ళల్లో మెదిలే పేరు సుమ. ఎంత మంది యాంకర్లు వచ్చినా సరే ఆమెకు ఉన్న డిమాండ్ మాత్రం తగ్గడం లేదు. అయిదు పదుల వయసు వచ్చినా సరే సుమ గ్లామర్ ఎక్కడా తగ్గకుండా ముందుకు వెళ్తుంది. కేరళ అమ్మాయి అయినా సరే తెలుగు మాట్లాడే విధానం మాత్రం చాలా బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఆమె సంపాదన కూడా భారీగానే ఉంటుంది.
సుమ సినిమాల్లో కూడా నటిస్తుంది. అయితే సినిమాల్లో ఆమెకు అనుకున్న విధంగా ఫలితం రాలేదు. జయమ్మ పంచాయితీ అనే సినిమా పెద్దగా ఆకట్టుకోలేదు. ఇదిలా ఉంచితే ఇప్పుడు సుమ మరింత బిజీగా మారుతుంది. వరుస షో లతో భారీగా డిమాండ్ చేస్తుంది. క్యాష్ స్థానంలో సుమ అడ్డా అనే షో ప్రసారం అవుతుంది. ఈ షో ద్వారా సుమ నెలకు 8 లక్షలకు పైగా సంపాదిస్తుంది.
1,60,000 వరకు ఎపిసోడ్ కి రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు అని టాక్. నెలకు దాదాపు 5 ఎపిసోడ్ లో ప్రసారం అవుతున్నాయి. ఇతర యాంకర్ లు ఎవరూ ఈ రేంజ్ లో తీసుకోవడం లేదు. త్వరలోనే ఇంటర్వ్యూలు కూడా సుమ ప్లాన్ చేస్తున్నారని ఒక ఓటీటీలో ఆమెతో భారీ ఒప్పందం చేసుకున్నారని టాక్ నడుస్తుంది. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ లకు కూడా సుమనే మొదటి చాయిస్ గా ఉన్నారు.