టాలీవుడ్ లో మాస్ సినిమాలను పోకిరి ముందు పోకిరి తర్వాతగా చెప్తారు కొందరు. పూరి జగన్నాథ్ ఆ సినిమా విషయంలో ఫాన్స్ ను అన్ని విధాలుగా ఆకట్టుకునే విధంగా కథ తయారు చేసి మంచి హిట్ కొట్టాడు. ఎన్నో రికార్డులను ఆ సినిమా బద్దలు కొట్టింది. అయితే ఆ సినిమా ముందు నెగటివ్ టాక్ తో వచ్చి తర్వాత మంచి హిట్ కొట్టింది. దానికి కారణం ఆ సినిమా క్లైమాక్స్ అంటారు సినిమా పండితులు.
Also Read:కేటీఆర్ బహిరంగ క్షమాపణ చెప్పాలి..
పోకిరి సినిమా క్లైమాక్స్ ఫైట్ ముందు వచ్చే సన్నివేశంలో మహేష్ బాబు పోలీస్ అని తెలవడం, అక్కడి నుంచి చూపించే సన్నివేశాలు సినిమా రేంజ్ ను ఎక్కడికో తీసుకెళ్ళాయి. సినిమాలో కామెడి అలాగే సాంగ్స్ అన్నీ బాగున్నా సరే ఏం జరుగుతుంది అనేది చివరి వరకు క్లారిటీ ఉండదు. సినిమా చూసే వాళ్లకు హీరో గురించి అసలు చివరి వరకు క్లారిటీ ఉండదు. హీరోయిన్ ను ప్రేమించే విషయంలో కూడా మహేష్ నుంచి క్లారిటి ఉండదు.
విలన్ ప్రకాశ రాజ్ అలాగే హీరో తండ్రి నాజర్ మధ్య జరిగే ఆర్గ్యూలో నాజర్ తన కొడుకు ఐ.పి.ఎస్. అధికారి అని కృష్ణ మనోహర్ ఐపిఎస్ అని చెప్తాడు. అక్కడ మణి శర్మ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమా రేంజ్ ను మరో ఎత్తుకు తీసుకు వెళ్ళింది. ఇక అప్పటి వరకు పోకిరిగా తిరిగిన మహేష్ బాబు పోలీస్ దుస్తులలో కనిపించగానే ప్రేక్షకులు నిలబడిపోయారు. అప్పటి వరకు ఊహించని ప్రేక్షకులు అందరూ ఆ సీన్ తో షాక్ లోనే థియేటర్ నుంచి బయటకు వచ్చారు.
Also Read:రాక్షస నత్తగుల్ల