సినిమా పరిశ్రమలో నిలబడటం అనేది అనుకున్నంత సులువు కాదు అనే మాట వాస్తవం. వెనుక ఏదైనా సపోర్ట్ ఉంటే వెంటనే సెటిల్ కావచ్చు. కాని ఏం లేకపోతే మాత్రం టాలెంట్ ను నమ్ముకుంటే గట్టిగా ఏదోక హిట్ కొట్టాల్సి ఉంటుంది. అలా గట్టిగా వచ్చి సూపర్ హిట్ అయిన వారిలో పూరి జగన్నాథ్ ఒకరు. ఆయనకు సినిమా పరిశ్రమలో ఏ విధమైన సపోర్ట్ లేకుండానే పైకి వచ్చి హిట్ లు కొట్టారు.
ఇప్పుడు స్టార్ హీరోలు అయిన చాలా మంది ఆయన సినిమాల ద్వారానే మంచి మాస్ ఇమేజ్ కొట్టిన వాళ్ళు. అలాంటి పూరి కెరీర్ మొదట్లో చాలా కంగారు పడిన సందర్భాలు ఉన్నాయి. అందుకే తన సోదరుడు అయిన పరుశురాం ని సినిమాల్లోకి వద్దని చెప్పేవారట. ఏ పరుశురాం అనుకుంటున్నారా…? గీతా గోవిందం, సర్కారు వారి పాట సినిమాలు చేసి సూపర్ హిట్ లు కొట్టిన దర్శకుడు.
పూరి జగన్నాథ్ కు ఆయన దగ్గరి బంధువు. ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు. ఇంటి పేర్లు కూడా ఒకటే. పెట్ల పూరి జగన్నాథ్, పెట్ల పరుశురాం. పూరి జగన్నాథ్ సినిమాల్లోకి వచ్చిన మొదట్లో తాను కూడా వస్తాను అంటే వద్దని ఆపారట. కాని మళ్ళీ పట్టుదలగా ఉండటంతో తన టీం లోకి తీసుకుని అవకాశాలు ఇచ్చారు. ఇప్పుడు ఆయన స్టార్ దర్శకుడి ఇమేజ్ సొంతం చేసుకుని దూసుకుపోతున్నారు.
Also Read: చిరంజీవితో ఆ సినిమా చేసుంటే… ఆ డైరెక్టర్ కెరీర్ మరోలా ఉండేదా…?