సినిమా పరిశ్రమలో జయసుధ అరుదైన హీరోయిన్ అనే మాట వాస్తవం. అరుదైన అనే మాట వాడటానికి చాలా కారణాలు ఉన్నాయి. చాలా మంది హీరోయిన్లు చేయడానికి భయపడే పాత్రలను ధైర్యంగా చేసారు జయసుధ. అగ్ర హీరోయిన్ గా వెలుగుతున్న సమయంలోనే రిస్క్ కూడా చేసారు. స్టార్ హీరోలకు అమ్మగా అక్కగా ఎన్నో సినిమాల్లో నటించారు. జయసుధకు ఇప్పటికి కూడా అదే డిమాండ్ ఉంది.
అసలు జయసుధకు సినిమాల్లోకి రావడం ఏ మాత్రం ఇష్టం లేదట. మరి ఆమె సినిమాల్లోకి ఎలా వచ్చారో చూద్దాం. జయసుధ తల్లి పేరు జోగాబాయి కాగా ఆవిడకు సినిమాలే ప్రపంచంగా ఉండేవారు. జయసుధకు మాత్రం సినిమాలంటే నచ్చదు. అంత సేపు సినిమా హాల్ లో ఎవరు కూర్చుంటారు అనే భావనలో ఆమె ఉండేవారు. తల్లితో కూడా దీనికి సంబంధించి వాదన జరిగిన సందర్భాలు ఉన్నాయట.
అయితే జయసుధ తండ్రి రమేష్ ఆమె జాతకం రాయించారు. ఆ జాతకంలో మీ పెద్దమ్మాయి సినిమా నటిగా ఎవరూ ఊహించని స్థాయికి ఎదుగుతుంది అని చెప్పారట. అలాగే గొప్ప పేరు, బోలెడు డబ్బు సంపాదిస్తుందని రాసారు. సినిమాలు అంటేనే మండిపడే ఆమెకు ఇలా ఏంటీ అనుకున్నారట. ఈ విషయాలను విజయ నిర్మల తన పుస్తకంలో రాసారు. విజయనిర్మల జయసుధకు చాలా దగ్గర బంధువు కావడంతో విజయ నిర్మల సహకారంతో జయసుధ సినిమాల్లో మంచి అవకాశాలు కొట్టేసి ప్రూవ్ చేసుకున్నారు.