రజనీ కాంత్ కెరీర్ లో భాష సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఈ సినిమా తర్వాత రజనీ కాంత్ ఇమేజ్ ఒక రేంజ్ కు వెళ్ళింది అనే మాట వాస్తవం. ఈ సినిమా తర్వాత రజనీ కాంత్ కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. నగ్మా హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను సురేశ్ కృష్ణ డైరెక్టర్ గా తెరకెక్కించారు. అంతకు ముందు సురేశ్ కృష్ణ చెప్పిన కథ రజనీ కాంత్ కు అసలు నచ్చలేదు.
Also Read:భార్య ప్రణీతకి పెళ్లి చూపుల్లో ఎన్టీఆర్ అడిగిన ఒకటే ప్రశ్న అది ఇదేనట !
దీనితో మంచి కథ రెడీ చేసుకుని రావాలని చెప్పడంతో సురేశ్… భాష స్టోరీ రాసారు. ఈ సినిమాను తెలుగులో డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తే మన దగ్గర కూడా సూపర్ హిట్. ఈ సినిమాలో ఒక డైలాగ్ ఇప్పటికీ వినపడుతూనే ఉంటుంది. ఇక రజనీ కాంత్ మేనరిజం కూడా చాలా బాగా నచ్చుతుంది. అయితే ఈ సినిమా తెలుగులో చిరంజీవి చేయాల్సి ఉంది. ఈ నేపధ్యంలో అగ్ర నిర్మాత అల్లు అరవింద్ రైట్స్ కోసం భాష నిర్మాతల వద్దకు వెళ్ళారు.
వాళ్ళు 40 లక్షలు ఇస్తేనే సినిమా హక్కులు ఇస్తామని చెప్పారు. అయితే అరవింద్ మాత్రం 25 లక్షలు ఇస్తా అన్నారట. అయితే వాళ్ళు వద్దని చెప్పెసారట. అప్పట్లో 40 లక్షలు అంటే చాలా ఎక్కువ. దానికి తోడు ఆ సినిమా తెలుగులో డబ్బింగ్ అయి వచ్చింది. దీనితో కథ మొత్తం అభిమానులకు క్లారిటీ ఉంది. కాబట్టి 40 లక్షలు పెట్టి కొని… సినిమా ఫ్లాప్ అయితే దండగ అని వద్దనుకున్నారట.