కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రం ఆచార్య. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మించిన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించారు. ఏప్రిల్ 29న భారీ అంచనాలతో రిలీజైన ఈ చిత్రం అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.
ఇకపోతే ఈ సినిమాలో పూజాతో పాటు మొదట కాజల్ అగర్వాల్ ని కూడా హీరోయిన్ గా సెలక్ట్ చేశారు. ఆమెపై కొన్ని రోజులు షూటింగ్ కూడా చేశారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆమె పాత్రను పూర్తిగా కట్ చేశారు. కాజల్ పాత్ర తో పాటు మరో పాత్రను కూడా మేకర్స్ కట్ చేశారు. అదే గెటప్ శ్రీను నటించిన పాత్ర.
ALSO READ : పవన్ మూడో భార్య ఆస్తులు విలువ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే !!
మామూలుగా అయితే అప్పుడప్పుడే ఎదుగుతున్న ఓ నటుడు కు స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ వస్తే అది విషయం అనే చెప్పాలి. అలానే గెటప్ శ్రీను కూడా భావించాడు. ఖైదీ నెంబర్ 150 సినిమాలో గెటప్ శ్రీను కు మొదట ఛాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు ఆచార్య సినిమాలో కూడా ఛాన్స్ వచ్చింది. ఈ సినిమా కోసం చాలా రోజులు కష్టపడ్డాడట. కానీ చివరలో ఎలాంటి ఫలితం లేకుండా గెటప్ శ్రీను పాత్రనే లేపేసారు మేకర్స్.
ALSO READ :హ్యాపీ డేస్ అప్పు…ఎలా మారిపోయిందో తెలుసా!! చూస్తే షాక్ అవ్వాల్సిందే
కాజల్ తో గెటప్ శ్రీను కు సంబంధించిన కామెడీ సన్నివేశాలను మొదట తెరకెక్కించారట. కాజల్ పాత్రను తీసేయాల్సి రావడంతో గెటప్ శ్రీను పాత్రను కూడా తీసేశారట. దీంతో ఇదే విషయమై తన సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నాడట. ఈ సినిమా విడుదల తర్వాత తనకు ఎంతో మంచి పేరువస్తుందని భావించాడట. కానీ అనుకోకుండా ఇలా జరిగిపోయింది. ఏదేమైనా అన్ని రోజులు కష్టపడి ఆఖరిలో ఎడిటింగ్ లో తీసేయడం అంటే కాస్త భాద కలిగించే విషయమనే చెప్పాలి.