స్టార్ హీరోయిన్ నయనతార డైరెక్టర్ విగ్నేష్ ను జూన్ 9న వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఎప్పటినుంచో ప్రేమలో ఉన్న ఇద్దరు ఎట్టకేలకు ఇప్పుడు వివాహం చేసుకున్నారు. ఒక రిసార్ట్ లో చాలా సింపుల్ గా సాంప్రదాయబద్దంగా వీరి వివాహం జరిగింది. అతి తక్కువ మంది బంధువులు ఈ పెళ్లికి హాజరయ్యారు. ఇక ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
అయితే ఈ పెళ్లి లో నయనతార తల్లి ఒమాయ కురియన్ ఎక్కడా కనిపించలేదు. ఆమె పెళ్ళికి కూడా హాజరు కాలేదు. ఇదే వార్త కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. సొంత కూతురు పెళ్లికి తల్లి రాకపోవడం ఏంటి అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే నిజానికి పెళ్ళికి ముందు విఘ్నేష్ శివన్ నయనతారల తో ఆమె ఎన్నో ఫోటోలు దిగారు. ఆ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
చిరు సినిమాలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ మాస్టర్ అర్జున్ ఎలా ఉన్నాడో తెలుసా?
కానీ ఇప్పుడు పెళ్లికి రాకపోవడం అనేది అందరికీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అయితే ఆవిడ పెళ్లికి రాకపోవడానికి పెళ్లి పద్ధతులు విషయంలో కొన్ని కారణాలు ఉన్నాయట. అందుకే ఆమె పెళ్ళికి రాలేదట. ఇక పెళ్లి తర్వాత నయనతార విగ్నేష్ కేరళలోని కొన్ని ఆలయాలను సందర్శిస్తున్నారు.
ఆలస్యంగా పెళ్లి చేసుకుంటే వచ్చే సమస్యలు ఏంటో తెలుసా ?
అలాగే పెళ్లి తర్వాత నయన్ సినిమాలు కూడా చేయదని సోషల్ మీడియాలో టాక్ నడుస్తుంది. అయితే అఫీషియల్ ప్రకటన మాత్రం రాలేదు. మరి చూడాలి ఏం జరుగుతుందో.