దర్శకుడు వెంకీ కుడుముల ఛలో, భీష్మ చిత్రాలతో మంచి హిట్స్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ రెండు చిత్రాలు కూడా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించాయి. అంతే కాదు ఈ రెండు సినిమాల్లోనూ ఒకే హీరోయిన్. ఆమెనే రష్మిక మందన్న. అయితే ఇప్పుడు వెంకీ మెగాస్టార్ చిరంజీవితో ఓ సినిమా చేయబోతున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది.
కాగా తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో నటించేందుకు హీరోయిన్ ను వెతుకుతున్నాడట వెంకీ. వయసు కారణంగా చిరుకు రష్మిక సరిపోదనే కారణంతోనే వెంకీ వేరే ఆప్షన్స్ వెతుకుతున్నాడట. మొదట చిరుతో స్టాలిన్ లో నటించిన త్రిష వైపు కూడా నిర్మాతలు దృష్టి పెట్టారట.
ఇప్పుడు మాత్రం మాలావి మోహనన్‌ను సెలెక్ట్ చేసుకున్నారట. మలావి గతంలో పేట, మాస్టర్ వంటి చిత్రాల్లో నటించారు. ధనుష్ మారన్ లో కూడా నటిస్తున్నారు. ఇవన్నీ దృష్టి లో పెట్టుకుని చిరుతో ఆమెజోడిగా బాగుంటుదని మేకర్స్ భావిస్తున్నారట. అయితే, ఇది ఇప్పటికీ రూమర్ గా మాత్రమే ఉంది. అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఇక చిరు నటించిన ఆచార్య చిత్రం రిలీజ్ కు సిద్ధంగా ఉండగా… భోళా శంకర్, గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య చిత్రాలు షూటింగ్ దశలో ఉన్నాయి.