దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ హీరోలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం ఆర్ఆర్ఆర్. భారీ అంచనాల మధ్య పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అలియా భట్ అజయ్ దేవగన్, కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ శరవేగంగా జరుగుతున్నాయి. అయితే ఈ ప్రమోషన్స్ లో రాజమౌళి ఫ్యామిలీ మొత్తం కనిపిస్తున్నా అతని తండ్రి విజయేంద్ర ప్రసాద్ మాత్రం కనిపించడం లేదు. నిజానికి రాజమౌళి సినిమా అంటే విజయేంద్ర ప్రసాద్ కూడా ప్రమోషన్స్ లో పాల్గొంటూ ఉంటారు. ఆ సినిమాకు సంబంధించిన కొన్ని కీలక విషయాలను కూడా షేర్ చేసుకుంటూ ఉంటారు.
కానీ ఈ సినిమా విషయంలో ఆయన ఎక్కడా కనిపించడం లేదు. దానికి కొన్ని కారణాలు ఉన్నాయట. విజయేంద్రప్రసాద్ వయసు రీత్యా అలాగే ఆరోగ్య సమస్యల కారణంతో ప్రమోషన్స్ కి దూరంగా ఉన్నారట. గత ఏడాది ఏప్రిల్ నెలలో విజయేంద్రప్రసాద్ కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది.
ఆ తర్వాత విజయేంద్రప్రసాద్ మీడియా ముందు పెద్దగా కనిపించలేదు. కాగా ప్రస్తుతం రాజమౌళి, మహేష్ బాబులు చేయబోయే సినిమా స్క్రిప్ట్ పనులు చేస్తూనే మరోవైపు రెస్ట్ తీసుకుంటున్నారట.
నిజానికి జక్కన్న సక్సెస్ లో విజయేంద్రప్రసాద్ పాత్ర ఎంతో కీలకమైనదనే చెప్పాలి. ఇక భారీ బడ్జెట్ తో ఎన్నో అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమాకు విజయేంద్రప్రసాద్ ఎలాంటి కథను అందించారనేది తెలియాలంటే…ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.
కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాను డివివిఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో శ్రియ, సముద్రకని, ఒలివియా మోరీస్ తదితరులు నటిస్తున్నారు.