నందమూరి బాలకృష్ణ హీరోగా వచ్చిన అఖండ సినిమా గత ఏడాది సూపర్ హిట్ అయింది. ఈ సినిమాతో బాలకృష్ణ మంచి ఫాం లోకి వచ్చారు. గత ఏడాది చివర్లో విడుదల అయిన ఈ సినిమా వసూళ్లు కూడా గతంలో ఎన్నడు లేని విధంగా ఉన్నాయి. బాలకృష్ణ కెరీర్ లో భారీ లాభాలు అందించిన సినిమాగా నిలిచింది. ఈ సినిమా తర్వాత గోపిచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తున్నారు.
ఈ సినిమాకు ప్రభాస్ హీరోగా వచ్చే సలార్ సినిమాకు లింక్ ఉందని అంటున్నారు. ఏ విధంగా లింక్ అనేది చూద్దాం. అఖండ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు చాలా బాగా ఆకట్టుకున్నాయి. కాని దేవుడికి లింక్ చేస్తూ సినిమాను పూర్తి చేసారు. ఇప్పుడు ఆ కాన్సెప్ట్ ని సలార్ సినిమాకు కూడా వాడే ఆలోచనలో ఉన్నారు. యాక్షన్ సన్నివేశాలు సలార్ సినిమాకు బాగా హైలెట్ అవుతాయనే టాక్ ఉంది.
ఈ నేపధ్యంలో దైవాన్ని కూడా లింక్ చేస్తే బాగుంటుందని దర్శకుడు భావించాడని అంటున్నారు. ఈ మధ్య కాలంలో హిందూ దేవుళ్ళ మీద వచ్చే సినిమాలకు మంచి స్పందన వస్తుంది. కార్తికేయ 2 కూడా మంచి హిట్ అయింది. దీనితో ప్రశాంత్ నీల్ కూడా అదే ప్లాన్ లో ఉన్నాడని త్వరలోనే దైవానికి సంబంధించిన సన్నివేశాలను కూడా షూట్ చేస్తారని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.