కస్టమర్ల భద్రతను దృష్టిలో ఉంచుకుని రిజర్వ్ బ్యాంక్ బ్యాంక్ లాకర్ రూల్స్‌లో పెద్ద మార్పు చేసింది. ఏదైనా బ్యాంక్‌లో లాకర్‌ని తెరవాలని ఆలోచిస్తున్నట్లయితే లేదా మీకు ఇప్పటికే ఏదైనా బ్యాంకులో లాకర్ ఉంటే, మీరు కొత్త నిబంధనల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం అంటున్నారు నిపుణులు. బ్యాంకు లాకర్లపై ఖాతాదారుల నుంచి నిరంతర ఫిర్యాదులు రావడంతో రిజర్వ్ బ్యాంక్ ప్రస్తుత నిబంధనలలో మార్పులు చేయాలని నిర్ణయించింది.
కొత్త నియమాలు జనవరి 1, 2022 నుండి అమల్లోకి వచ్చాయి. అయితే ఈ నిబంధనలు ఏంటీ అనేది ఒకసారి చూద్దాం. బ్యాంకు లాకర్లలో చోరీకి గురైన ఉదంతాలు ఎక్కువగా ఉన్న నేపధ్యంలో… రిజర్వ్ బ్యాంక్ ఇప్పుడు కఠిన నిబంధనలను రూపొందించి బ్యాంకుల బాధ్యతను పెంచింది. లాకర్ లో సొమ్ముకి సంబంధించి ఏదైనా సమస్యతో కోల్పోయినా లేదంటే… దొంగతనానికి గురైనా సరే కస్టమర్ కు వంద శాతం సొమ్ము చెల్లించాల్సి ఉంటుంది.
బ్యాంకు లాకర్ దొంగతనాలకు తాము బాధ్యులం కాదని బ్యాంకులు బ్యాంకు లు చెప్పడానికి అవకాశం లేకుండా పోయింది. ఇప్పుడు బ్యాంకులు లాకర్ గదులను పర్యవేక్షించేందుకు సీసీటీవీలను ఏర్పాటు చేయడం తప్పనిసరిగా బ్యాంకులకు ఆదేశాలు ఇచ్చింది. దీనితో పాటు, 180 రోజుల పాటు సీసీటీవీ డేటాను ఉంచడం కూడా తప్పనిసరి చేసింది. పోలీసు విచారణ పూర్తయ్యే వరకు ఖాతాదారుడు ఏదైనా అవాంతరాలు లేదా దొంగతనం గురించి బ్యాంకుకు ఫిర్యాదు చేస్తే ఫూటేజ్ అందించాల్సి ఉంటుంది.
మోసాల నుండి కస్టమర్లను రక్షించడానికి, రిజర్వ్ బ్యాంక్ ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు ఖాతాదారుడు తన లాకర్‌ను యాక్సెస్ చేసిన ప్రతిసారీ బ్యాంకు నుంచి మెసేజ్ వెళ్ళాల్సి ఉంటుంది. రిజర్వ్ బ్యాంక్ కొత్త నిబంధనల ప్రకారం, లాకర్‌కు సంబంధించిన సగం పూర్తయిన లేదా తప్పుడు సమాచారాన్ని బ్యాంకులు ఖాతాదారులకు ఇవ్వకూడదు . ఖాళీ లాకర్ల జాబితా, లాకర్ కోసం వెయిటింగ్ లిస్ట్ మరియు వెయిటింగ్ లిస్ట్ నంబర్‌ను పబ్లిక్‌గా తెలియజేయాల్సి ఉంటుంది. వీటిని బ్యాంకు డిస్‌ప్లే బోర్డులో పెట్టాలి.