టీం ఇండియా కెప్టెన్ లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మధ్య విభేదాలు ఉన్నాయనే ప్రచారం రెండు మూడేళ్ళ నుంచి జరుగుతూనే ఉంది. విరాట్ కోహ్లీని ఇప్పుడు కెప్టెన్ గా పక్కన పెట్టి వైట్ బాల్ క్రికెట్ కు రోహిత్ శర్మను ఎంపిక చేయడం పట్ల కాస్త భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. కావాలనే రోహిత్ శర్మ కోసం కోహ్లి ని పక్కన పెట్టారనే వార్తలు కూడా వస్తున్న నేపధ్యంలో చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ స్పందించారు. ఆ ఇద్దరి మధ్య ఏ విభేదాలు లేవనే విషయాన్ని ఆయన స్పష్టం చేసారు.
ఈ విషయంలో ఇన్ని రోజులుగా చేతన్ శర్మ సైలెంట్ గా ఉండి ఇప్పుడు ఎట్టకేలకు మౌనం వీడారు. దక్షిణాఫ్రికా కోసం భారత వన్డే జట్టును ప్రకటించే ముందు వర్చువల్ గా మీడియాతో మాట్లాడిన ఆయన… పరిస్థితి అంతా బాగానే ఉందని… అందుకే ఊహాగానాల జోలికి వెళ్లవద్దు అని చెప్పానని ఆయన మీడియాను ప్రస్తావించారు. మేమందరం ముందు క్రికెటర్లం మరియు తరువాత సెలెక్టర్లం అన్నారు ఆయన. వారి మధ్య ఏమీ లేదని స్పష్టం చేసారు.
కొన్నిసార్లు నేను వాళ్ళ గురించి వచ్చిన వార్తలు చూసి నవ్వుతాను అని… భవిష్యత్తు గురించి వారికి మంచి ప్లానింగ్ ఉందనే విషయాన్ని తాను మీడియాకు స్పష్టం చేస్తున్నట్టుగా చేతన్ శర్మ పేర్కొన్నారు. తన ప్లేస్ లో మీడియా ఉండి ఉంటే వాళ్ళు, అలాగే టీం కలిసి పని చేస్తున్న విధానం చూసి సంతోషం వ్యక్తం చేస్తారని పేర్కొన్నారు. గత ఏడాది అంతా అయిపోయిందని ఆ విషయాలు వదిలేసి మంచి జట్టుని తయారు చేసే విధానం గురించి ఆలోచించాలని సూచించారు.