ఆరోగ్యకరమైన ఆహారంలో ఫ్రూట్స్ ముందు వరుసలో ఉంటాయి. అందులో యాపిల్, దానిమ్మ, అరటి, జామ ఇలా ఎన్నో ఫ్రూట్స్ మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి అనే మాట నిజం. అందుకే యాపిల్ విషయంలో గాని ఇతర పళ్ళ విషయంలో గాని ప్రజలు ఆసక్తి చూపిస్తూ ఉంటాయి. అయితే చాలా మంది పళ్ళల్లో ఉండే గింజలు మాత్రం తినడానికి ఇష్టపడరు.
Also Read:భోజనం చేసిన తర్వాత సిగరెట్ తాగితే ఆ రోగం పక్కా…!
అలాంటిదే యాపిల్ గింజలు కూడా. ఈ ఫలంలో ఉండే గింజలు మనకు విషం. యాపిల్ గింజల్లో అమిగ్డలిన్ అని ఒక రసాయనం ఉంటుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అది మన శరీరంలో జీవక్రియ వల్ల విరగ్గొట్టబడి, అత్యంత విషపూరితమైన హైడ్రోజన్ సైనైడ్ గా మారే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఆ హైడ్రోజన్ సైనైడ్ అత్యంత విశాపూరితంగా చెప్తున్నారు శాస్త్రవేత్తలు.
అది గనుక మన శరీరంలో అధిక మోతాదులో చేరితే మాత్రం కొద్ది నిమిషాల్లోనే మనిషిని చంపే అవకాశం ఉంటుంది. నమలకుండా మింగిన గింజలో నుంచి అమిగ్డలిన్ విడుదలయ్యే అవకాశం ఉండదు. మనం తినేడప్పుడు ఒకటి రెండు గింజలు నమిలినా సరే ఏ సమస్య ఉండదు. అయితే యాపిల్ రకాన్ని బట్టి కొన్ని వందల నుంచి వేల గింజలు పనికట్టుకుని నమిలి మింగితే మినహా విష ప్రభావం ఉండదు.
Also Read:అక్కడ ట్రెండ్ సెట్ చేసిన ఆర్ఆర్ఆర్.. కొత్త రికార్డులు నమోదు