ఒకప్పుడు వచ్చిన సినిమాల్లో ఉన్న పాటలకు ఒక అర్ధం ఉండేది. ఆ పాటల్లో ఉన్న అర్ధాలు ఆకట్టుకునేవి. ప్రస్తుతం వస్తున్న చాలా పాటలు అసలు జనాలకు అర్ధం కాని పరిస్థితి ఉంది. సినిమాల్లో పాటకు వాడిన సాహిత్యం గురించి అప్పట్లో చర్చలు కూడా జరిగేవి. ఇలా సావిత్రి చేసిన ఒక పాట అయితే అప్పట్లో సూపర్ హిట్ అయింది. సావిత్రికి కూడా ఆ పాట మంచి ఇమేజ్ తెచ్చి పెట్టింది అనే చెప్పాలి.
తోడికోడళ్లు అనే సినిమా అప్పుడు మంచి హిట్ అయింది. ఆ సినిమాలో బాగా హిట్ అయిన పాట… కారులో షికారుకెళ్లే.. పాలబుగ్గల పసిడీ దానా. ఇప్పటికి కూడా మనకు గ్రామాల్లో వినపడుతూ ఉంటుంది. ఈ పాట షూటింగ్ కూడా చాలా బాగా జరిగింది. వాస్తవానికి ఈ పాట రాసింది… ఆత్రేయ. ఆయన రాసే పాటలను చాలా మంది సాడ్ సాంగ్స్ అంటారు. కాని ఈ పాట మాత్రం అలా ఉండదు.
అభ్యుదయం దిశగా వెళ్తుంది ఈ పాట. పాటలో చరణం చరణానికి చాలా తేడా కనపడుతుంది. పేదలను.. కార్మికులను హీరోలుగా చూపిస్తూ అలాగే పెద్దలు అనుభవిస్తున్న దర్జాకు వారే కారణమనే విధంగా పాట ఉంటుంది. అలానే షూట్ చేయాలని ఆత్రేయ అనుకున్నారు. కాని సావిత్రి అందుకు నో అనడంతో ఏ హడావుడి లేకుండానే సోలోగా పాటను షూట్ చేసారు.