సినిమా పరిశ్రమలో ప్రేమ వ్యవహారాలకు పెళ్లి వ్యవహారాలకు సోషల్ మీడియాలో ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. ఏ చిన్న వార్త వచ్చినా సరే దాన్ని వైరల్ చేస్తూ సందడి చేస్తూ ఉంటారు. అగ్ర హీరోల నుంచి చిన్న హీరోల వరకు దాదాపుగా ఇలాగే ఉంటుంది పరిస్థితి. ప్రస్తుతం టాలీవుడ్ లో పెళ్లి చేసుకోకుండా సైలెంట్ గా ఉన్న హీరోల గురించి ఆసక్తికర చర్చ జరుగుతుంది. అందులో యువ హీరో శర్వానంద్ ఒకరు.
ఎప్పుడో 15 ఏళ్ళ క్రితం సినిమాల్లోకి వచ్చిన ఈ సిల్వర్ స్పూన్ హీరో ఇప్పుడు పెళ్లి గురించి ఆలోచిస్తున్నాడు. దాదాపు రెండు మూడేళ్ళ నుంచి అతని పెళ్లి పైనే చర్చలు నడుస్తున్నాయి. ఈ తరుణంలో ఒక అమ్మాయిని కుటుంబ సభ్యులు ఫిక్స్ చేసారని… ఆ అమ్మాయితోనే అతని పెళ్లి జరిగే అవకాశం ఉందని తెలుస్తుంది. అసలు ఆ అమ్మాయి ఎవరు, ఆ కథ ఏంటీ అనేది చూస్తే ఆ అమ్మాయి అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అని టాక్.
అమెరికాలో ఉంటూ అక్కడే ఆస్తులు కూడా సంపాదించారని… వర్క్ ఫ్రొం హోం ఉండటంతో ఆమె హైదరాబాద్ లోనే ఉంటున్నారు అని… సామాజిక వర్గం ఒకటే కావడం అలాగే శర్వానంద్ కి కూడా నచ్చడంతో ఓకే చేసారని ప్రచారం జరుగుతుంది. ఆ అమ్మాయి పెళ్లి చేసుకున్న తర్వాత ఇండియాలోనే జాబ్ చేయాలని అనుకుంటున్నారని లేదా ఒక సాఫ్ట్ వేర్ కంపెనీని శర్వానంద్ సహకారంతో ఏర్పాటు చేస్తారని ప్రచారం జరుగుతుంది.