బ్రహ్మానందం కామెడీ టైమింగ్… డైలాగ్ డెలివరీ గురించి ఎంత చెప్పినా తక్కువే. కొన్ని వందల సినిమాల్లో నటించారు బ్రహ్మానందం. తాను స్క్రీన్ పై కనబడితే చాలు ప్రేక్షకుల ముఖంలో చిరునవ్వులు కనిపిస్తాయి. తన హావభావాలతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాడు బ్రహ్మానందం. అయితే గతంలో మాదిరిగా ఇప్పుడు సినిమాలు చేయడం లేదు బ్రహ్మానందం.
అప్పట్లో బ్రహ్మానందం లేనిదే సినిమా ఉండేది కాదు. స్టార్ హీరోల సినిమా అయినా సరే బ్రహ్మానందం ఉంటే ఆ సినిమాకు క్రేజ్ వచ్చేది. అయితే గత కొంత కాలంగా వివిధ రకాల కారణాలతో బ్రహ్మానందం సినిమాలకు దూరంగా ఉన్నారు. దానికి ప్రధాన కారణం ఆయన రెమ్యునరేషన్ అని కొందరు అంటున్నారు. మరికొందరు మాత్రం సర్జరీ వలన ఇండస్ట్రీకి దూరమయ్యారని అంటున్నారు.
ALSO READ : ఎన్టీఆర్, కృష్ణలు అప్పుడు అలా… బాలయ్య మహేష్ ఇప్పుడు ఇలా
నిజానికి బ్రహ్మానందం ఒకప్పుడు రోజుకు 5 లక్షల రూపాయలు తీసుకునేవారట. అయినప్పటికీ కూడా ఆఫర్స్ అతన్ని వెతుక్కుంటూ వచ్చేవి. కానీ ఇప్పుడు ఆ స్థాయిలో రావడం లేదు. ఇక ప్రస్తుతం బ్రహ్మానందం పంచతంత్రం అనే సినిమాలో ప్రధానపాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా కోసం ఆయన అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు.
ALSO READ : హెలికాప్టర్ ప్రమాదానికి ముందు హీరోయిన్ సౌందర్య చివరిగా మాట్లాడిన మాటలు అవేనా ?
ఒక సాధారణ లెక్చరర్ నుంచి ఇండస్ట్రీలో స్టార్ కమెడియన్ గా మారారు బ్రహ్మానందం. అతి తక్కువ టైమ్ లోనే వెయ్యికి పైగా సినిమాల్లో నటించి గిన్నిస్ బుక్ రికార్డుల్లోకి ఎక్కారు. అయితే కరోనా ఎంటర్ అయిన తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమైన బ్రహ్మానందం మనవరాళ్లతో కలిసి సమయాన్ని గడుపుతున్నారు.