ఒలంపిక్స్ లో క్రికెట్ చేర్చాలని కొందరు డిమాండ్ చేస్తూ ఉంటారు. ఎప్పుడో ఒకసారి మీడియా కూడా దీని గురించి సందడి చేస్తూ ఉంటుంది. అయితే ఇప్పటి వరకు క్రికెట్ ఎందుకు ఒలంపిక్స్ లో చేర్చలేదు అనేది ఒకసారి చూద్దాం. జనసాంద్రత గల ప్రాంతాల ప్రజలు అంటే భారత ఉపఖండం, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా వంటి దేశాలు క్రికెట్ గురించి ఆసక్తిగా ఉన్నా సరే… ఈ క్రికెట్ కేవలం 20 దేశాల లోపే పరిమితం అయిపోయింది.
Also Read:నదిలో కొట్టుకు పోయిన కారు…. 9 మంది మృతి
ఫుట్‌బాల్, అథ్లెటిక్స్, బాక్సింగ్ మొదలైన ఇతర ప్రసిద్ధ క్రీడలతో పోలిస్తే క్రికెట్ కు ఆ రేంజ్ లో ఆసక్తి ఉండదు. ఆర్ధికంగా బలంగా ఉన్న ఎన్నో దేశాలు క్రికెట్ ను లైట్ తీసుకున్నాయి. అమెరికా, జపాన్, చైనా, రష్యా, జర్మనీ మొదలైన దేశాలు పెద్దగా క్రికెట్ ను పట్టించుకోలేదు. అదే విధంగా… క్రికెట్ ఆటలను ఏర్పాటు చేయడం అనేది లాజిస్టిక్ ఇబ్బంది ఎక్కువ. క్రికెట్ మైదానాలను ప్రత్యేకంగా తయారు చేయాల్సి ఉంటుంది.
క్రికెట్ ఆడే గ్రౌండ్ లో మరో ఆట ఆడటం కుదరదు. అలాగే క్రికెట్ లో ఆధిపత్యం ఎక్కువ. అంటే ఆతిధ్యం ఇచ్చే దేశాలు తమ ఆటగాళ్లకు అనుకూలంగా గ్రౌండ్ లు తయారు చేస్తాయి. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ పేస్ పిచ్ లను తయారు చేసినట్టు. అందుకే ఆ గ్రౌండ్ లో ఇంకొక ఆట కుదరదు. మ్యాచ్ సమయం కూడా దీని మీద ప్రభావం చూపిస్తుంది. ఉదాహరణకు టి 20 మ్యాచ్ నిర్వహిస్తే కనీసం 4 గంటల సమయం పడుతుంది. ఇక బలమైన క్రికెట్ దేశాలు కూడా ఒలంపిక్స్ మీద ఆసక్తి చూపించలేదు.
Also Read:పండగల్ని ఆక్రమించిన చిరంజీవి