జబర్దస్త్ అంటే రశ్మీ, రశ్మీ అంటే జబర్దస్త్ అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది ఒకప్పుడు. మల్లెమాల వాళ్ళు నిర్మించే ఈ షో విషయంలో ఆమె చాలానే కష్టపడింది. కెరీర్ కు వచ్చిన మొదటి షో కావడంతో ఆమె ఎక్కడా వెనకడుగు వేయకుండా ముందుకు వెళ్ళింది. రశ్మీ కి అభిమానులు కూడా అలానే పెరిగారు అని చెప్పాలి. ఆమె కోసమే జబర్దస్త్ చూసిన వారి సంఖ్య కూడా అప్పట్లో బాగానే ఉంది.
ఆమెపై ఎన్ని రూమర్లు వచ్చినా సరే వెనకడుగు వేయకుండా ఆ షో చేసింది రశ్మీ. ప్రస్తుతం ఆమె కెరీర్ మరో వైపు వెళ్ళినా జబర్దస్త్ కు మళ్ళీ వచ్చే అవకాశం ఉందని అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. అయితే కొత్తలో ఆమె బాగా ఇబ్బంది పడింది అని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కెరీర్ ను ఈ రంగంలోనే ఎంచుకోవడం తో ఆమె షో వచ్చిన తర్వాత ఏ షరతులు లేకుండా ముందుకు వెళ్ళింది.
మల్లెమాల యాజమాన్యం కూడా ఆమెను అలాగే గౌరవించింది. మొదట్లో ఆమెకు రెమ్యునరేషన్ ఒక కాల్ షీట్ కి లక్ష రూపాయలు ఉండేది. అంటే అప్పుడు నాలుగైదు ఎపిసోడ్ లు షూట్ చేసేవారు. డ్రెస్ కోడ్ విషయంలో కూడా ఇబ్బంది పెట్టేది కాదట. అలాగే డైలాగ్స్ ను కూడా ఈజీగా చెప్పేది. అలా షో కి బలం అయింది. ఎంత కష్టం ఉన్నా సరే జబర్దస్త్ కోసమే రశ్మీ సమయాన్ని కేటాయించింది. మల్లెమాల యాజమాన్యం క్రమంగా ఆమెను ప్రోత్సహించడం, రెమ్యునరేషన్ పెంచడం చేసింది. ఇప్పుడు ఆమెకు సినిమాల్లో కూడా మంచి అవకాశాలు వస్తున్నాయి.