ఇప్పుడు టాలీవుడ్ లో యువ హీరోల హడావుడి ఎక్కువగా ఉంది. సిద్దు జొన్నలగడ్డ, అడవి శేష్, విశ్వక్ సేన్ వంటి వాళ్ళు ఎక్కువ హడావుడి చేస్తున్నారు. నానీ వంటి హీరోలు కాస్త సైలెంట్ కావడంతో ఇప్పుడు వీళ్ళు మార్కెట్ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. అటు శర్వానంద్ కూడా కాస్త సైలెంట్ గానే కనపడుతున్నాడు. నాగ శౌర్య సినిమా ఎప్పుడు వస్తుందో కూడా అర్ధం కాని పరిస్థితి.
ఇక విశ్వక్ సేన్ విషయానికి వస్తే ఇప్పుడు బాలకృష్ణతో ఎక్కువ స్నేహం చేస్తున్న ఈ యువ హీరోకి యూత్ లో మంచి క్రేజ్ ఉంది. హిట్ సినిమా ద్వారా మంచి ఫ్యాన్ బేస్ ని సంపాదించుకున్నాడు. యాటిట్యూడ్ తో కూడా కాస్త అభిమానులను పెంచుకున్నాడు అనే చెప్పాలి. అయితే ఇప్పుడు ఈ హీరో రెమ్యునరేషన్ విషయంలో నిర్మాతలకు చుక్కలు చూపిస్తున్నాడు అనే టాక్ వినపడుతుంది.
యువ హీరోలందరు రెమ్యునరేషన్ పెంచడంతో విశ్వక్ సేన్ కూడా పెంచాడు అని తెలుస్తుంది. మొన్నటి వరకు రెండు కోట్లు అడిగిన ఈ హీరో ఇప్పుడు అయిదు కోట్ల వరకు డిమాండ్ చేయడంతో నిర్మాతలకు ఏం చేయాలో అర్ధం కావడం లేదు. 15 కోట్ల మార్కెట్ ఉన్న ఈ హీరో అంత అడిగితే ఇవ్వడం కష్టం అంటున్నారు నిర్మాతలు. నైజాం తో పాటుగా రాయలసీమలో కూడా అతనికి ఫాలోయింగ్ ఎక్కువగానే ఉంది.