డబ్ల్యూడబ్ల్యూఈ … నిజమా లేక ఫేకా…? మన చిన్నపటి నుంచి దీని మీద అనేక అనుమానాలు. ఇప్పటికి కూడా దీని మీద చాలా మందికి క్లారిటీ లేదు. డబ్ల్యూడబ్ల్యూఈ పూర్తి నామం, వరల్డ్ వ్రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్ గానే ఉంటుంది కాబట్టి ఇది కచ్చితంగా వినోదం కోసమే అనేది చాలా మంది చెప్పే మాట. అయితే ఒకప్పుడు దీనికి యువతలో మంచి క్రేజ్ ఉండేది. కాని ఇప్పుడు మాత్రం పెద్దగా ఎవరూ ఆదరించకపోవడంతో సంస్థ నష్టాల్లో ఉందనే ప్రచారం కూడా జరుగుతుంది.
అయితే డబ్ల్యూడబ్ల్యూఈ కచ్చితంగా ఫేక్ అని అంటున్నారు కొందరు నిపుణులు. స్క్రిప్ట్ ప్రకారం మాత్రమే ఇందులో గెలుపు ఓటములు ఉంటాయని, అది కచ్చితంగా వినోదమే అంటున్నారు. దీనికి సంబంధించి కొన్ని ఆన్లైన్ వీడియో లు పరిశీలిస్తే ఈ విషయంలో క్లియర్ గా అర్ధమవుతుంది అనేది నిపుణుల మాట. మరికొందరు మాత్రం అన్ని ఫైట్స్ ఫేక్ కాదని, ఇందులో కొందరు సినీ నటులు చేసే ఫైట్స్ మాత్రమే అలాంటివి అంటున్నారు.
డబ్ల్యూడబ్ల్యూఈ … తనను తాను “స్పోర్ట్స్ ఎంటర్‌టైన్‌మెంట్”గా బ్రాండ్ చేస్తుంది. ప్రో-రెజ్లింగ్ గా ఎక్కడా కూడా చెప్పలేదు. దీనికి కారణం ఏమిటంటే, 1990లలో, ఎక్కువ రాయితీలు పొందడానికి అలాగే తక్కువ పన్నులు చెల్లించడానికి ఈ విధంగా ప్రమోట్ చేసారని అంటున్నారు. అమెరికా సుప్రీం కోర్ట్ ముందు ఆ సంస్థ చీఫ్ విన్స్ మెక్‌మాన్ ఇదే విషయం చెప్పాడు. ఇది కేవలం వినోదం కోసం మాత్రమె అని స్పష్టం చేసాడు.