వైసీపీ ఎంపీలు బీజేపీ గూటికి చేరబోతున్నారన్న వార్త మరింత జోరందుకుంది. ఉదయం ప్రధాని మోడీ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు పలకరించటం, గత వారం రోజులుగా వైసీపీ ఎంపీలు బీజేపీకి టచ్‌లోకి వెళ్తున్నారన్న వార్తకు బలం చేకూర్చింది. అంతకుముందు సీఎం జగన్ ఎంపీలను హెచ్చరింటం, ఆ తర్వాత మీటింగ్‌కే విజయసాయితో భేటీకి సగం మంది ఎంపీలు డుమ్మా కొట్టడం సర్వత్రా చర్చ జరుగుతోంది.
అలాంటి పరిస్థితుల్లో బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. కొందరు వైసీపీ ఎంపీలు బీజేపీతో టచ్‌లో ఉన్నారని ప్రకటించారు. ఎవరెవరు పార్టీలోకి వస్తారని తాను ఇప్పుడే చెప్పలేనని, మతపరమైన అంశాల్లో చంద్రబాబుకు-జగన్‌కు పెద్ద తేడా లేదన్నారు. బీజేపీ ఏపీలో బలపడి… పరిపాలించే స్థాయికి తీసుకొస్తామని ధీమా వ్యక్తం చేశారు.