మాస్కు పెట్టుకోలేదని కిరణ్ అనే యువకుడిని కొట్టి చంపారు. అక్రమ ఇసుక రవాణా కి అడ్డుపడ్డాడని వరప్రసాద్ కి శిరోముండనం చేసారు.ఇప్పుడు ఇళ్ల పట్టా అడిగినందుకు శ్రీకాకుళంలో మర్రి జగన్ పై దాడికి దిగారు. శ్రీకాకుళం లో దళిత యువకుడి పై సిఐ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని ట్విట్టర్ వేదికగా నిప్పులు చెరిగారు నారాలోకేష్. ఇళ్ల పట్టా అడిగినందుకు పలాస మండలం టెక్కలిపట్నం గ్రామానికి చెందిన మర్రి జగన్ పై వైకాపా నాయకులు దాడి చేసారు.
న్యాయం చెయ్యాలంటూ పోలీస్ స్టేషన్ కి వెళితే నడి రోడ్డు పై తల్లి ముందే బూటు కాలితో తన్ని చితకబాదాడు స్థానిక సిఐ. వైకాపా నాయకుల్లా వ్యవహరిస్తూ ప్రజలను హింసిస్తున్న పోలీసుల పై కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రజలకు రక్షణ కల్పించాలని నారా లోకేష్ డిమాండ్ చేశారు.