కేరళ లోని ఏర్నాకులంకు చెందిన DCP ఐశ్వర్య డోంగ్రే ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు. ఆమె చేసినపనికి “మేడమ్ మరీ ఇంత ఓవర్ యాక్షన్ పనికి రాదoటూ” తమదైన శైలిలో కౌంటర్లు వేస్తున్నారు నెటీజన్లు.
ఇంతకీ ఏమైందీ?
IPS గా ఎంపికైన ఐశ్వర్య ఏర్నాకులం DCP గా….రెండు వారాల కిందటే ఛార్జ్ తీసుకున్నారు. ఏర్నాకులం మహిళా పోలీస్ స్టేషన్ కు ఇన్స్పెక్షన్ కు వెళ్లారు. ఇన్స్పెక్షన్ కు వెళ్లే సమయంలో యూనిఫామ్ వేసుకోలేదు, పైగా మాస్క్ కూడా పెట్టకోవడంతో …అక్కడ డ్యూటీలో ఉన్న ఓ మహిళా కానిస్టేబుల్ ఐశ్వర్యను ఆపింది…. పనేంటి? అని ప్రశ్నించింది. దీంతో సీరియస్ అయిన DCP …సదరు మహిళా కానిస్టేబుల్ ను ట్రాఫిక్ డిపార్ట్మెంట్ కు ట్రాన్స్ఫర్ చేసింది .
ఎర్ర బుగ్గ కార్ లో వస్తే కూడా గుర్తు పట్టవా? మినిమమ్ ప్రోటోకాల్ తెలియదా అంటూ గరంగరం అయ్యింది డీసీపి….. ఈ విషయాన్ని ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్లారు కేరళ పోలీస్ అసోసియేషన్ సభ్యులు.!