మురళీవదన కృష్ణ దాస్, ఇస్కాన్ నిర్వాహకులు
ఆధ్యాత్మిక, సాంస్కృతిక నగరం వరంగల్ లో ఇస్కాన్ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా శ్రీ జగన్నాథుని రథయాత్ర కోసం ఏర్పాట్లు పూర్తి చేశాం. ఒడిశా రాష్ట్రంలోని పూరీ పుణ్యక్షేత్రంలో జరిగే రథయాత్రను కళ్లారా చూడలేని వారికి అంతే ప్రసిద్ధితో అందించాలని ప్రతీ ఏడాది ఇస్కాన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం. ఈ మహత్కార్యంలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని భగవంతుని ఆశీస్సులు అందుకోవాలి.
లోకకళ్యాణం కోరుకునే శ్రీ జగన్నాథుడు కొలవైన రథం లాగిన భక్తుల జన్మసార్ధకం అవుతుందని, దీన్ని పూర్వజన్మసుకృతంగా భావించడం జరుగుతుంది. ఇవాళ మధ్యాహ్నం ఒంటిగంటకు హన్మకొండ కేయు క్రాస్ నుండి ప్రారంభం అవుతుంది. నాయింనగర్, పెట్రోల్ పంపు, హన్మకొండ చౌరస్తా, ములుగురోడ్డు, ఎంజీఎం సర్కిల్, పోచమ్మ మైదానం నుండి తిరిగి ఎంజీఎం మీదుగా ములుగు రోడ్డుకు చేరుకుంటుంది రథయాత్ర.
ఎల్బీ కళాశాల పక్కనే ఉన్న వెంకటేశ్వర గార్డెన్ లో రాత్రి 8.30కి ముగింపు సభతో కార్యక్రమం పూర్తి అవుతుంది. ఈ రథయాత్ర అధ్యంతం అధ్యాత్మిక భక్తి భావనతో కూడిన కీర్తనలు, భజనతో ఓరుగల్లు నగర పురవీధుల్లో సాగుతుంది.
ముగింపు కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొంటారు. ఎమ్మెల్యేలు వినయ్ భాస్కర్, నరేందర్, అరూరి రమేష్, మేయర్ గుండు సుధారాణి, అధికారులు, కలెక్టర్, నగర పురప్రముఖులు రానున్నారు.