కరోనా వైరస్ పుణ్యమా అని సినీ రంగానికి చెందిన సెలబ్రిటీలు అందరూ ఇళ్లకే పరిమితం అయ్యారు. నచ్చిన పనులను చేసుకుంటూ సమయాన్ని గడుపుతున్నారు. ఇంటి నుండి బయటికి వెళ్లే పరిస్థితి లేక పోవడం ఇష్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ పబ్జీ గేమ్ తో సమయాన్ని గడుపుతుందట.. లాక్ డౌన్ కారణంగా ఇళ్లకే పరిమితం అయినా చాలా అంది పబ్జీ గేమ్ ఆడుతున్నారు. ఇప్పుడు నేను కాలక్షేపం కోసం పబ్జీ గేమ్ మొదలు పెట్టాను అని తన ట్విట్టర్ ద్వారా చెప్పుకొచ్చింది. పబ్జీ గేమ్ ఆడుతున్న వీడియో షేర్ చేస్తూ “అండ్ ఇట్ బిగిన్స్” అంటూ ట్విట్ చేసింది.
సవ్యసాచి చిత్రం తో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు ఇటీవల ఇస్మార్ట్ శంకర్ సినిమా తో మంచి హిట్ అందుకుంది. ప్రస్తుతం అశోక్ గల్లా ఓ సినిమా చేస్తుంది. దీనితో పాటు మరికొన్ని సినిమాల్లో కూడా నటిస్తుంది.