ఇస్మార్ట్ శంకర్ తో సూపర్ సక్సెస్ అందుకొని… మంచి ప్రశంసలు పొందిన హీరోయిన్ నిధి అగర్వాల్. తన అంద చందాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ భామ ఇప్పుడు కుర్రహీరో చిత్రంలో ఐటెం సాంగ్ కు కమిట్ అయినట్లు ఫిలింనగర్ వర్గాల సమాచారం.
అక్కినేని చైతూ సినిమా సవ్యసాచి చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత అఖిల్ తో మిస్టర్ మజ్నూ చేసింది. అయితే… ఆ సినిమాల్లో పెద్దగా పేరు తెచ్చుకోకపోయిన పూరీ జగన్నాథ్ సినిమా ఇస్మార్ట్ శంకర్ తో మంచి బూస్ట్ వచ్చింది.
ఇస్మార్ట్ శంకర్ తర్వాత ఫుల్ అవకాశాలు వస్తాయని అనుకుప్పటికీ ఊహించినంత రేంజ్ లో మాత్రం లేవట. అయితే తమిళ్ లో ఓ సినిమా చేయగా త్వరలో రిలీజ్ కాబోతుందని తెలుస్తుంది. అయితే… ఈ గ్యాప్ లో ఖాళీగా ఉండటం ఎందుకు అనుకుందో ఏమో… తెలుగులో ఓ కుర్రహీరో సినిమాలో ఐటెం నెంబర్ కు ఒప్పేసుకుందని, అయితే ఇందుకోసం ఆ నిర్మాత భారీగానే ముట్టజెప్పినట్లు ప్రచారం సాగుతోంది. ఇంతకీ ఎవరా కుర్రహీరో అనేకదా డౌట్…. ఈ విషయంలో కాస్త క్లారిటీ రావాల్సి ఉంది.