ఒక్క ఇస్మార్ట్ సాంగ్! లక్షల వ్యూస్ -ismart shankar dimakh kharab song creates new record in youtube - Tolivelugu

ఒక్క ఇస్మార్ట్ సాంగ్! లక్షల వ్యూస్

ఆ ఒక్క సాంగ్ గురూ ! ఒక ఊపు ఊపేస్తోంది. ఇస్మార్ట్ శంకర్ మూవీ రిలీజ్ అయి ఫాన్స్ ను ఎంతో ఆకట్టుకుంది. అందులో దిమాఖ్ ఖరాబ్ సాంగ్ ఎంతో ఖుషీ చేసింది.

ఎనర్జిటిక్‌స్టార్ రామ్‌, డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్‌లో రూపొందిన చిత్రం `ఇస్మార్ట్ శంక‌ర్‌`. ప‌క్కా మాస్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా హిట్ టాక్‌తో మంచి క‌లెక్ష‌న్స్‌ను సాధించింది. సినిమా రన్నింగ్ పూర్తయ్యాక కూడా ఆ మూవీ సాంగ్ క్రేజ్ తగ్గలేదు.

ismart shankar dimakh kharab song creates new record in youtube, ఒక్క ఇస్మార్ట్ సాంగ్! లక్షల వ్యూస్

సినిమాలోని `దిమాఖ్ ఖ‌రాబ్ వీడియో సాంగ్‌ను చిత్ర యూనిట్ యూ ట్యూబ్‌లో విడుద‌ల చేసింది. ఈ సాంగ్ రిలీజైన 21 గంట‌ల్లోనే 36 ల‌క్ష‌ల పైగా వ్యూస్‌ను సంపాదించుకుని సెన్సేష‌న‌ల్‌గా ముందుకు సాగుతోంది. ఈ మ‌ధ్య కాలంలో తెలుగు చిత్రాల్లోని వీడియోసాంగ్‌ల్లో `దిమాఖ్ ఖ‌రాబ్’ సాంగ్‌కు మంచి ఆద‌ర‌ణ ద‌క్కుతోంది. మ‌ణిశ‌ర్మ సంగీతం ఆకట్టుకుంది. `దిమాఖ్ ఖరాబ్’ సాంగ్ విషయానికి వస్తే శేఖ‌ర్ మాస్ట‌ర్ కొరియోగ్ర‌ఫీలో హీరో రామ్ ఎనర్జిటిక్ స్టెప్స్, న‌భాన‌టేశ్‌, నిధి అగ‌ర్వాల్ అంద‌చందాలు ఈ పాట‌కు క్రేజ్ అయ్యాయి. ఈ మాస్ సాంగ్‌ అటు వెండితెర‌పై ఇటు యూ ట్యూబ్‌లోనూ ప్రేక్ష‌కులు అంత కంటే ఎక్కువ‌గా ఎంజాయ్ చేస్తున్నారు.

Share on facebook
Share on twitter
Share on whatsapp