ఒకప్పుడు భాను ప్రియకు మంచి క్రేజ్ ఉండేది. ఆమె డాన్స్ కు నటనకు మంచి అభిమానులు ఉండేవారు. అగ్ర హీరోల సినిమాల్లో నటించిన ఆమె అగ్ర హీరోయిన్ గా మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఇక ఆమె గురించి అప్పట్లో కొన్ని గొప్ప మాటలు వచ్చేవి మీడియాలో. అలాంటి మాట ఒకటి ఏంటో చూద్దాం. ఆమె ఒంటి నుంచి సువాసనలు రావడమే. అసలు ఏంటి మేటర్ అనేది చూద్దాం.
నిర్మాత రామానాయుడు తన స్టూడియోలో కూర్చుని అప్పటి దిగ్గజ దర్శకుడు కె విశ్వనాథ్ తో మాట్లాడుతున్నారు. ఆ మాట్లాడే సమయంలోనే… కార్ లో నుంచి భానుప్రియ దిగి నిర్మాత వద్దకు వస్తుంటే… ఆమె వస్తున్న సమయంలో ఒక సువాసన వచ్చిందట. కాని ఆమె మాత్రం అప్పుడు సెంట్ కొట్టలేదు. కాని ఇది సహజ వాసన అని అర్ధమైంది అక్కడ ఆన్న వాళ్ళు. ఏంటి దానికి కారణం చూస్తే…
ఆమె అప్పుడు స్నానం చేసే సమయంలో సబ్బుతో కాకుండా సున్ని పిండి తో స్నానం చేసేవారట. తనకు సబ్బు వంటివి ఎలర్జీ అని అందుకే శాంపు వంటివి వాడకుండా కుంకుడు కాయతోనే తల స్నానం వంటివి చేస్తా అని పలు సందర్భాల్లో చెప్పిందట. ఆమెతో అప్పుడు సన్నిహితంగా ఉన్న వాళ్ళు కూడా ఇదే చెప్పేవారు. కాగా భానుమతి ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉన్నారు.