ఒక ఆహార పదార్ధం మంచిది అని ఎవరైనా ఒక సలహా ఇస్తే దాని అంతు చూసే వరకు మనకు నిద్ర ఉండదు. బాదం పప్పులు మంచివి అని ఎవరైనా చెప్తే టైం పాస్ కోసం కూడా నోట్లో పడేసి ఆడిస్తూ ఉంటారు. అవి ఎంత లిమిట్ గా తింటే అంత మంచిది. ఇక లవంగాల విషయంలో కూడా ఇదే జరుగుతుంది. లవంగాలను చాలా మంచిది అని చెప్పడంతో టీవీ చూస్తూ తినే బ్యాచ్ కూడా ఉంది.
Also Read: రష్మిక కావాలా.. మూడేళ్లు ఆగాల్సిందే!
ఇక నోటి దుర్వాసన విషయంలో కూడా లవంగాలు చాలా బాగా సహకరిస్తాయి గాని ఎంత పడితే అంత తినడం కరెక్ట్ కాదు. లవంగాల లో వోలటైల్ ఆయిల్ ఉంటుంది. దీన్లో యూజినాల్ అనే పదార్థం ఒకటి ఉంటుంది. ఇదే లవంగాలు మంచి వాసన రావడానికి కారణం. దీనికి కీటకాలను అరికట్టే గుణం, బ్యాక్టీరియా అరికట్టే మంచి గుణాలు కూడా ఉన్నాయి. యాంటి ఆక్సిడెంట్ గా శక్తి ఇస్తుంది. అందుకే డెంటిస్ట్ లు లవంగ నూనెను ఎక్కువగా ఉపయోగిస్తారు.
మంచి గుణాలు ఉన్నాయి కాబట్టి… అతిగా వాడటం మంచిది కాదు. యూజినాల్ ఎక్కువైతే గనుక కణాల్లోకి జొరబడే గుణం ఉంది. దీనితో కాలేయము, కొన్ని ఇతర భాగాలు దెబ్బ తినే అవకాశం ఉందని పరిశోధనలు చెప్తున్నాయి. ఇక రాత్రి బుగ్గన పెట్టుకుని పడుకోవటం అనేది మంచిది కాదు. గొంతులో అడ్డు పడే అవకాశం ఉంటుంది. బుగ్గన ఉంటే నాలుక మండే అవకాశం ఉంటుంది. నోటి దుర్వాసన తగ్గడానికి రాత్రి సమయాల్లో బ్రష్ చేసుకుని పడుకుంటే మంచిది.
Also Read: గోదావరి ప్రమాద హెచ్చరికలు ఎప్పుడు జారీ చేస్తారు…?