పాలస్తీనాపై ఇజ్రాయెల్ సైన్యం విరుచుపడింది. వెస్ట్ బ్యాంకులోని జెనిన్ పై ఇజ్రాయెల్ సైనికులు దాడులు చేశారు. దీనిపై తీవ్ర నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. రెండు దశాబ్దాల్లో ఇదే అత్యంత ఘోరమైన ఘటన అని పాలస్తీన పౌరులు చెబుతున్నారు. ఈ దాడుల్లో 11 మంది పాలస్తీనీయన్లు మరణించారు.
మృతుల్లో 61 ఏండ్ల మహిళ కూడా ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. ఓ ప్రభుత్వ ఆస్పత్రిపై ఇజ్రాయెల్ బలగాలు బాష్పవాయువు ప్రయోగించారని అధికారులు తెలిపారు. దీంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులు ఊపిరాడక ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పారు.
ఈ ఘటనపై పాలస్తీనా ప్రధాని మహమ్మద్ ష్టయేహ్ స్పందించారు. తమ దేశ ప్రజలకు, యువత, మహిళలకు ఇజ్రాయెల్ సేనల నుంచి రక్షణ కల్పించాలని ఆయన ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలను కోరారు. ఈ విషయంలో అంతర్జాతీయ సంస్థలు అత్యవసరంగా జోక్యం చేసుకోవాలని ఆయన అంతర్జాతీయ సంస్థలను ఆయన అభ్యర్థించారు.
దేశంలో భారీ దాడులకు ప్లాన్ చేస్తున్న తీవ్రవాదులను అరెస్టు చేసేందుకే ఉగ్రవాదులను అరెస్టు చేసేందుకే అక్కడికి వెళ్లారని ఇజ్రాయెల్ సైన్యం పేర్కొంది. దాడుల నేపథ్యంలో పాలస్తీనాలో అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్ పర్యటనపై నీలినీడలు కమ్ముకున్నాయి.