ఫోటోగ్రాఫర్లు తీసిన కొన్ని వీడియోల కానీ.. ఫోటోలు కానీ.. మనసుకి ఏదో తెలియని ఉల్లాసాన్ని కలిగిస్తాయి. అద్భుతాలు అనేవి ప్రపంచంలో చాలా అరుదుగా జరగుతాయి. అలాంటి అద్భుతాలు ఫోటో గ్రాఫర్ కంటి కనిపిస్తే.. వాటిని తను మాత్రమే చూసి ఎంజాయ్ చేయడు. ప్రపంచానికి కూడా చూపించాలి అని తపిస్తాడు. అప్పుడు తన కెమెరాకు పని చెబుతాడు. అలాంటి అద్భుతాన్నే ఇజ్రాయెల్ కు చెందిన వైల్డ్‌లైఫ్ ఫోటోగ్రాఫర్ ఆల్బర్ట్ కెషెట్ తన కెమెరాతో చిత్రీకరించాడు.
కొన్ని వేల పక్షులు గాల్లో ఎగురుకుంటూ.. ఒక్కసారిగా పైకిపోయి.. అక్కడ ఒక చెంచా ఆకారంలో గుంపుగా ఏర్పడ్డాయి. అక్కడ అవన్నీ డ్యాన్స్ చేశాయి. ఈ వీడియో చూస్తే ఎవరైనా వావ్ అనక మానరు. ఆ పక్షుల మధ్య ఉన్న అవగాహన, క్రమశిక్షణ చూస్తే ముచ్చట కలుగుతోంది.
This is the phenomenal unique never again moment the Starlings over the Jordan Valley swooped into the shape of a bending spoon with sugar Captured by nature photographer Albert Keshet. 🥄 pic.twitter.com/YDZVRt2GdB
— UriGeller.eth (@theurigeller) January 2, 2022