భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం ఇస్రో మరో ప్రయోగానికి సిద్ధమైంది. నెల్లూరులోని శ్రీహరి కోటలో GSLV- F10 రాకెట్ కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఉదయం 3.43 గంటలకు స్టార్ట్ అయిన కౌంట్ డౌన్ 26 గంటలపాటు కొనసాగనుంది. గురువారం ఉదయం 5.43 గంటలకు రాకెట్ ప్రయోగం చేపట్టనుంది ఇస్రో.
GSLV- F10 రాకెట్.. జీఐశాట్-1 ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టనుంది. దీని ద్వారా భూపరిశీలన అంశాలను తెలుసుకునే అవకాశం ఉంటుంది. కరోనా కారణంగా దాదాపు 18 నెలలపాటు షార్ లో ప్రయోగాలు ఏమీ జరగలేదు. ఈనెల నుంచే మళ్లీ లాంచింగ్ కి ఏర్పాట్లు మొదలుపెట్టారు. GSLV- F10 ప్రయోగం ఇప్పటికే నాలుగు సార్లు వాయిదా పడింది. ఈసారి ఎలాగైనా ప్రయోగించాలని ఇస్త్రో గట్టిగా ప్రయత్నిస్తోంది.