నాసా కంటే ముందే తాము చంద్రయాన్-2 ల్యాండర్ విక్రమ్ లొకేషన్ ను కనుగొన్నామని ఇస్రో చీఫ్ డాక్టర్ కె.శివన్ తెలిపారు. విక్రమ్ ల్యాండర్ శకలాలను తాము కనుగొన్నట్టు నాసా ప్రకటించిన మరసటి రోజు ఇస్రో ఛైర్మన్ స్పందించారు. నాసా ప్రకటన కంటే ముందే తమకు ఆ విషయం తెలుసునని అన్నారు. రాజస్థాన్ లో కిషన్ ఘడ్ లో మీడియాతో మాట్లాడిన ఆయన… విక్రమ్ ల్యాండింగ్ అయిన రోజే తమ స్పేస్ ఏజెన్సీ సొంత ఆర్బిటర్ ల్యాండర్ లొకేషన్ ను కనుగొన్నదని తెలిపారు. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పుకోలేదని . తాము ఆరోజే తమ వెబ్ సైట్ లో ఈ విషయాన్ని వెల్లడించామని..ఇస్రో వెబ్ సైట్ లోకి వెళ్లి ఆ రోజు డేట్ లో చూడవచ్చని స్పష్టం చేశారు.
చంద్రయాన్ -2 సెప్టెంబర్ 6న సాప్ట్ ల్యాండింగ్ అయ్యేటప్పుడు కాంటాక్ట్ కోల్పోయింది. సెప్టెంబర్ 10 న చంద్రుని ఉపరితలంపై విక్రమ్ ల్యాండర్ ను గుర్తించామని..అయితే దాంతో కమ్యూనికేషన్ లేదని ఇస్రో ప్రకటించింది. కమ్యూనికేషన్ పునురుద్ధరణ కోసం ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపింది. ఆ తర్వాత విక్రమ్ హార్డ్ ల్యాండింగ్ అయ్యిందని …దానికి సంబంధించిన థర్మల్ ఇజేజెస్ ను ఆర్బిటర్ తీసుకుందని ఇస్రో ప్రకటించింది. ఆ తర్వాత ల్యాండర్ హార్డ్ ల్యాండింగ్ కు కారణం సాప్ట్ వేర్ సమస్యనే కారణమని ప్రకటించింది.