ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి పీఎస్ఎల్వీ సీ 47 నింగిలోకి దూసుకెళ్లింది. ఈరోజు ఉదయం 9.28 నిమిషాలకు ఈ ఉపగ్రహాన్ని ప్రయోగించారు. 26 నిమిషాల తర్వాత ఉపగ్రహాలను నిర్దేశిత కక్ష్యలో ప్రవేశపెట్టనున్నారు. చంద్రయాన్-2 తర్వాత ఇస్రో ప్రయోగించిన తొలి ఉపగ్రహమిది. ఈ ప్రయోగం ద్వారా కార్డోశాట్-3 ఉపగ్రహంతో పాటు అమెరికాకు చెందిన 13 నానో ఉపగ్రహాలను కూడ నింగిలోకి పంపనున్నారు. మూడోతరం హై రెజల్యూషన్ ఎర్త్ ఇమేజింగ్ ఉపగ్రహమై కార్డోశాట్-3 జీవితకాలం ఐదేళ్లు. బరువు 1625 కిలోలు. ఉగ్రవాద శిబిరాలను కార్డోశాట్-3 మరింత స్పష్టంగా గుర్తించనుంది. పట్టణాభివృద్ధి ప్రణాళిక, గ్రామీణ వనరులకు సంబంధించిన సేవలను ఈ ఉపగ్రహం అందించనుది.