ఇస్రో చేపట్టిన GSLV- F10 ప్రయోగం విఫలమైంది. శ్రీహరికోటలోని స్పేస్ సెంటర్ నుంచి ఉదయం 5.43 గంటలకు రాకెట్ ను నింగిలోకి పంపారు. అయితే క్రయోజనిక్ దశలో సమస్య తలెత్తి.. ఈ ప్రయోగం ఫెయిల్ అయింది. GSLV- F10 రాకెట్ ద్వారా జీఐశాట్-1 ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టాలని అనుకున్నారు.
ఈ ప్రయోగం ద్వారా భూపరిశీలన అంశాలను తెలుసుకునే అవకాశం ఉండేది. ప్రకృతి వైపరీత్యాలను కూడా ఇది ముందే పసిగడుతుంది. కానీ.. మూడో దశలో సాంకేతిక సమస్య కారణంగా ప్రయోగం విఫలమైంది.
కరోనా కారణంగా దాదాపు 18 నెలలపాటు షార్ లో ప్రయోగాలు ఏమీ జరగలేదు. ఈనెల నుంచే మళ్లీ లాంచింగ్ కి ఏర్పాట్లు మొదలుపెట్టారు. GSLV- F10 ప్రయోగం ఇప్పటికే నాలుగు సార్లు వాయిదా పడింది. చివరకు ఫెయిల్ అయింది.