ప్రముఖ ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణ్ పై గూఢచర్యం కేసులో సీబీఐ కీలక విషయాలు వెల్లడించింది. అతని అరెస్టు అబద్దమని తేల్చి చెప్పింది. అతడి అరెస్ట్ చట్ట విరుద్ధమని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ) పేర్కొంది. ఈ మేరకు హైకోర్టుకు సీబీఐ నివేదిక ఇచ్చింది.
1994లో ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణ్ పై గూఢచర్యం కేసు నమోదు అయింది. ఈ కేసులో విచారణ అనంతరం ఆయన నిరపరాధిగా తేలింది. ఈ క్రమంలో తనపై తప్పుడు కేసులు పెట్టిన వారిపై ఆయన న్యాయపోరాటం చేస్తున్నారు. దీంతో నంబి నారాయణ్ పై విచారణ జరిపిన అధికారులపై సీబీఐ కేసులు నమోదు చేసింది.
ప్రస్తుతం వీరి బెయిల్ పిటిషన్ పై కేరళ హైకోర్టులో విచారణ జరగుతోంది. జాతీయ భద్రతకు సంబంధించి నకిలీ గూఢచర్యం కేసు అత్యంత తీవ్రమైన అంశమని సీబీఐ పేర్కొంది. ఇస్రోలోని ప్రముఖ శాస్త్రవేత్తలపై తప్పుడు కేసులు పెట్టేందుకు విదేశీ శక్తులు కుట్రపన్నాయని పేర్కొంది.
ఇస్రో కార్యక్రమాల్లో కీలకమైన క్రయోజనిక్ ఇంజిన్ టెక్నాలజీని నిలిపేసేందుకు గాను నంబినారాయణ్ పై ఈ కేసును మోపారని ఆయన తరఫు న్యాయవాది అన్నారు. రాకెట్లలో వాడే క్రయోజనిక్ ఇంజిన్ల తయారీకి ఉపయోగించేందుకు భారత్ కృషి చేస్తున్న రోజులవి.
ఈ పరిశోధన బృందానికి నంబి నారాయణ్ నేతృత్వం వహిస్తున్నారు. 1994లో కావాలని కొందరు కుట్ర చేసి ఆయన్ని దేశద్రోహం కేసులో అక్రమంగా ఇరికించారు. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నంబియార్ ను కేరళ పోలీసులు అరెస్టు చేశారు.
మాల్దీవులకు చెందిన ఓ మహిళ ద్వారా క్రయోజనిక్ టెక్నాలజీని దాయాది దేశం పాక్ కు అందజేస్తున్నారంటూ ఆయనపై ఆరోపణలు చేశారు. దీంతో సుమారు 50 రోజలు పాటు ఆయన జైల్లో చిత్రహింసలు ఆయన అనుభవించారు. ఆ తర్వాత ఈ కేసు కేరళ ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి సీబీఐకి బదిలీ అయింది.
1996లో నంబి నారాయణ్‌తో పాటు మరో ఐదుగురిని సీబీఐ నిర్దోషులుగా ప్రకటించింది. 1998లో ఈ కేసును మరోసారి ఓపెన్ చేసేందుకు కేరళ సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇస్రోలో ఎలాంటి క్రయోజనిక్ సమాచారం లీక్ కాలేదని అంతర్గత విచారణలో తేలింది.
2018లో తనపై అక్రమంగా కేసు పెట్టిన కేరళ సర్కార్ పై నంబి నారాయణ్ కేసు పెట్టారు. దీంతో నంబియార్ కు రూ. 50 లక్షలు పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రభుత్వం రూ.50 లక్షలు కాకుండా రూ. 1.30 లక్షలు ఇస్తామని ప్రకటించింది. కానీ 2019లో ఎన్డీయే ప్రభుత్వం ఆయన్ని ‘పద్మ భూషణ్’తో సత్కరించింది.