ఇస్రో చేపట్టిన పీఎస్ఎల్వీ – C54 ప్రయోగం విజయవంతమైంది. నెల్లూరులోని శ్రీహరి కోట నుంచి 9 ఉపగ్రహాలను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. Oceansat-3తో పాటు మరో 8 నానో ఉపగ్రహాలను ప్రయోగించారు. వీటిలో ఒకటి భూటాన్‌కు చెందిన శాటిలైట్ కూడా ఉంది. 11.56 గంటలకు ఈ ప్రయోగం లాంచ్ కాగా…విజయవంతంగా కక్ష్యలోకి వెళ్లినట్టు ఇస్రో ప్రకటించింది.
ఈ మొత్తం ఉపగ్రహాల బరువు 1,117 కిలోలు. ఈ 8 నానో శాటిలైట్స్‌లో భూటాన్ సాట్, పిక్సెల్‌కు చెందిన ఆనంద్, ధ్రువ స్పేస్ అందించిన రెండు Thybolt ఉపగ్రహాలు, స్పేస్‌ఫ్లైట్ యూఎస్ఏకు చెందిన నాలుగు ఉపగ్రహాలున్నాయి.
EOS శాట్-6 సహా 8 నానో ఉపగ్రహాలను పీఎస్‌ఎల్‌వీ సీ-54 నిర్దేశిత కక్ష్యలోకి మోసుకెళ్లినట్టు ఇస్రో శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. Oceansat-3 శాటిలైట్స్ ద్వారా భూవాతావరణాన్ని పరిశీలించడం, తుఫానులను ముందుగానే గుర్తించడం, వాతావరణంలో తేమను అంచనా వేయడం సాధ్యమవుతుంది.
వీటితో పాటు సముద్ర వాతావరణాన్నీ అధ్యయనం చేసేందుకు ఉపకరిస్తాయి. ప్రయోగం విజయవంతం కావడంపై ఇప్రో శాస్త్రవేత్తలు ఆనందం వ్యక్తం చేశారు.ఓషన్ శాట్…భూ పరిశీలన ఉపగ్రహం. సముద్ర పరిశీలనలను లక్ష్యంగా చేసుకున్న ఉపగ్రహాల శ్రేణిలో ఇది మూడోదని శాస్త్రవేత్తలు వెల్లడించారు.
ISRO launches #PSLVC54 🚀 carrying EOS-06 (Earth Observation Satellite – 06) and 8 Nano-satellites
⬛The mission objective is to ensure the data continuity of Ocean colour and wind vector data to sustain the operational applications. pic.twitter.com/CDWqfTT9WI— All India Radio News (@airnewsalerts) November 26, 2022
అంతరిక్ష ప్రయోగాల్లో ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించేందుకు, స్టార్టప్ లకు అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తోంది ఇస్రో. దీనిలో భాగంగా హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న స్టార్టప్ ‘స్కైరూట్ ఏరోస్పేస్’ ఈ రాకెట్‌ను రూపొందించింది.
ఇస్రో, ఇన్ స్పేస్ సహకారంతో రెండేళ్ల కాల వ్యవధిలో దీన్ని సిద్ధం చేశారు. దీనికి విక్రమ్ సారాభాయ్ పేరు పెట్టారు. విక్రమ్-ఎస్1 అనే పేరుతో ఈ ప్రయోగం ఇటీవలే విజయవంతంగా పూర్తైంది. తొలిసారిగా పంపిన రాకెట్ పేరు ప్రారంభ్. ప్రారంభ్ పేరుతో విక్రమ్-ఎస్ రాకెట్లను వరుసగా పంపేందుకు స్కైరూట్ ప్రణాళికలు సిద్ధం చేసుకొంటోంది.
విక్రమ్-ఎస్ రాకెట్ మొత్తం మూడు చిన్న ఉపగ్రహాలను అంతరిక్షంలోకి తీసుకెళ్లింది. వీటిలో రెండు భారత్ కు చెందినవి కాగా, మూడోది విదేశీ సంస్థది. ఈ రాకెట్ కు సంబంధించిన ఫుల్ డ్యూరేషన్ టెస్ట్ మేలో విజయవంతంగా పూర్తి చేశారు.
WATCH| The PSLV-C54/ EOS-06 mission with Oceansat-3 and eight nano satellites, including one from Bhutan, blasts off from Sriharikota spaceport pic.twitter.com/HYynWzx1Ru
— Prasar Bharati News Services & Digital Platform (@PBNS_India) November 26, 2022