మెఘా సోదాలపై తొలిసారిగా ఐటీ అధికారులు స్పందించారు. మొత్తం 30 చోట్ల ఏక కాలంలో ఐటీ దాడులకు దిగగా…భారీగా మనీ లాండరింగ్ కు పాల్పడినట్లు ఆధారాలు దొరికినట్లు ప్రకటించింది.
సబ్ కాంట్రాక్టర్లకు జరిగిన చెల్లింపులు, భారీగా అక్రమ బిల్లులతో పాటు చాలా చోట్ల టాక్స్ చెల్లించాల్సిన డబ్బు కట్టకుండా ఎగవేసినట్లు పేర్కొంది. దాదాపుగా 17.4కోట్ల లెక్కలేని డబ్బును సీజ్ చేసినట్లు ప్రకటన విడుదల చేశారు.
ఈ అక్రమాస్తులు , పన్ను ఎగవేత, మనీ లాండరింగ్ పై ఇంకా విచారణ కొనసాగుతున్నట్లు ఇన్కమ్ టాక్స్ కమిషనర్ సురభి అహ్లువాలియా తెలిపారు.
అయితే… నేరుగా సంస్థ పేరు చెప్పకుండా…. హైదరాబాద్ కేంద్రంగా ఉన్న ఇన్ఫ్రా,పవర్,ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టే సంస్థ అని పేర్కొంది. ఇటీవలే మెఘా పై 6 రోజుల పాటు ఇండ్లు కార్యాలయాలపై దాడులు జరిగాయి.కానీ పిఆర్ టీమ్ మాత్రం మొదటిరోజు మామూలు తనిఖీలే అని చెప్పారు. కానీ ఐటీ సంస్థ మాత్రం హైదరాబాద్ కేంద్రంగా 30 చోట్ల దాడులు చేసినట్టు ఉత్తర్వులిచ్చింది. ప్రస్తుతం మెఘా కృష్ణరెడ్డి ఎక్కడ ఉన్నాడో తెలీదు. దీనిపైనా మెఘా గ్రూప్ ఏవిధంగా స్పందిస్తుందో చూడాలి.