ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడీమర్ జెలెన్ స్కీ కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ తో చర్చలు జరిపేందుకు తాను సిద్ధంగా ఉన్నట్టు ఆయన తెలిపారు.
కానీ చర్చలు విఫలమైతే అది మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీసే అవకాశం ఉందని వెల్లడించారు. సీఎన్ఎన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ మేరకు ఆయన వ్యాఖ్యలు చేశారు.
‘ పుతిన్ తో మాట్లాడేందుకు, రష్యాతో చర్చించేందుకు అక్కడ ఒక్క శాతం అవకాశం ఉన్నాదాన్ని వినియోగించుకోవాలని నేను భావిస్తున్నాను. కానీ ఈ ప్రయత్నాలు విఫలమైతే మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుంది” అని అన్నారు.
ఉక్రెయిన్ లో మార్షల్ లాను పొడిగించే బిల్లుపై జెలెన్ స్కీ సంతకం చేశారు. మార్షల్ లాను మార్చి 26 నుంచి మరో 30 రోజుల వరకు పొడిగిస్తున్నట్టు ఆయన తెలిపారు.