దేశ ప్రజల ప్రయోజనాలకే తమ ప్రభుత్వం తొలి ప్రాధన్యత ఇస్తుందని ప్రధాని మోడీ అన్నారు. పెట్రోల్, డీజిల్‌లపై సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీని తగ్గించడంపై ఆయన ఈ మేరకు ట్వీట్ చేశారు.
దేశ ప్రజల ప్రయోజనాలే తమ ప్రభుత్వ తొలి ప్రాధాన్యత అని తెలిపారు. ఈ రోజు నిర్ణయయాలు, ప్రత్యేకంగా పెట్రోల్, డీజిల్ ధరలను గణనీయంగా తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయం అన్ని వర్గాలపై పాజిటివ్ ప్రభావాన్ని చూపుతుందన్నారు.
ఈ నిర్ణయం దేశ ప్రజలకు ఉపశమనాన్ని కలిగిస్తుందని తెలిపారు. ఉజ్వలా పథకం లబ్ధి దారులకు గ్యాస్ సిలిండర్ పై రూ. 200ల సబ్సిడీని ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. ఈ నిర్ణయం ఎంతో మందికి మేలు చేస్తుందన్నారు.
ఉజ్వల పథకం ఎంతో మందికి ఉపయోగపడిందని పేర్కొన్నారు. ప్రత్యేకంగా మహిళలకు ఇది ఎంతగానో మేలు చేసిందన్నారు. ఉజ్వల పథకానికి సబ్సిడీ నిర్ణయం లక్షలాది కుటుంబాల బడ్జెట్ భారాన్ని తగ్గిస్తుందని ట్వీట్ చేశారు.