ఇప్పటికే కొన్ని సిరీస్‌లకు టీమిండియా తాత్కాలిక హెడ్ కోచ్‌గా వ్యవహరించిన భారత మాజీ దిగ్గజం వీవీఎస్ లక్ష్మణ్ భవిష్యత్తులో పూర్తిస్థాయిలో బాధ్యతలు చేపట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయి. టీమిండియా దిగ్గజ ప్లేయర్, ప్రస్తుత భారత జట్టు హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ స్థానంలో లక్ష్మణ్ బాధ్యతలు స్వీకరించవచ్చు. 2023 వన్డే వరల్డ్‌కప్ తర్వాత ద్రవిడ్‌కు బీసీసీఐ ఉద్వాసన పలకనున్నట్లు సమాచారం తెలుస్తోంది.
2023 నవంబర్‌తో హెడ్ కోచ్‌గా ద్రవిడ్ రెండేళ్ల పదవీకాలం ముగియనుంది. భారత మాజీ ప్లేయర్ రవిశాస్త్రి అనంతరం టీమిండియా హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ బాధ్యతలు చేపట్టారు. 2021 నవంబర్ నెలలో ద్రవిడ్ కోచ్‌గా బాధ్యతలు అందుకున్నారు. జాతీయ క్రికెట్ అకాడమీ అధినేతగా, భారత ఏ జట్టు కోచ్‌గా సక్సెస్ అయిన ద్రవిడ్.. టీమిండియా హెడ్ కోచ్‌గా మాత్రం అంతగా రాణించలేదు. ద్రవిడ్ నేతృత్వంలోని భారత ప్రధాన జట్టు పెద్ద పెద్ద విజయాలేమీ అందుకోలేదు. ఆసియాకప్ 2021, టీ20 ప్రపంచకప్ 2021, టీ20 ప్రపంచకప్ 2022లలో కనీసం ఫైనల్స్ చేరకుండానే ఇంటిదారి పట్టింది. దాంతో ద్రవిడ్‌ను హెడ్ కోచ్ నుంచి తప్పించాలన్న డిమాండ్లు వినిపించాయి.
అదే సమయంలో భారత ఏ జట్టుకు హెడ్ కోచ్‌గా వ్యవహరించిన వీవీఎస్ లక్ష్మణ్ విజయవంతమయ్యారు. రాహుల్ ద్రవిడ్ స్థానంలో పలుసార్లు భారత సీనియర్ జట్టుకు తాత్కాలిక హెడ్ కోచ్‌గా కూడా సక్సెస్ అయ్యారు. ఐర్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్, జింబాబ్వేతో వన్డే సిరీస్, న్యూజిలాండ్‌తో టీ20-వన్డే సిరీస్‌లకు లక్ష్మణ్ హెడ్ కోచ్‌గా పనిచేశారు. కివీస్ వన్డే సిరీస్ మినహా భారత్ మిగతా సిరీస్‌లను గెలుచుకుంది. దాంతో అందరూ లక్ష్మణ్ వైపు చుస్తునారు.
2023 చివర్లో జరిగే వన్డే ప్రపంచకప్‌తో రెండేళ్ల ఒప్పంద కాలాన్ని రాహుల్ ద్రవిడ్ పూర్తి చేసుకోనున్నారు. ద్రవిడ్‌కి పొడిగింపు లభించకపోయినా లేదా అతడే కోచ్‌గా తప్పుకోవాలని భావించినా.. వీవీఎస్ లక్ష్మణ్‌కే టీమిండియా హెడ్ కోచ్ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. ప్రస్తుతం జాతీయ క్రికెట్ అకాడమీ హెడ్‌గా ఉన్న లక్ష్మణ్‌తో బీసీసీఐ సంప్రదింపులు కూడా జరుపుతోందట. ఇందుకు హైదరాబాద్ సొగసరి కూడా సుముఖంగానే ఉన్నట్లు సమాచారం తెలుస్తోంది.