విడతల వారీగా కరోనా ప్రపంచ వ్యాప్తంగా విజృంభిస్తోంది. కరోనా మూడవ వేవ్ ఒమిక్రాన్ ప్రబలుతున్న తరుణంలో భారత్ లో మరో రెండు డోసుల టీకాను అందించనున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. అమెరికాకు చెందిన నొవావాక్స్ నుంచి టీకా సాంకేతికతను పొందిన ఎస్‌ఐఐ కొవొవాక్స్ కొత్త టీకాను ఉత్పత్తి చేసింది. సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (పుణె) తయారుచేసిన ‘కొవొవాక్స్’కు… బయోలాజికల్-ఈ తయారు చేసిన కార్బెవాక్స్ కు అనుమతులు మంజూరు చేయాలని కోరుతూ… సీడీఎస్‌సీవో నిపుణుల కమిటీ సిఫార్సు చేసింది. టీకా సాంకేతికతను పొందిన ఎస్‌ఐఐ… కొవొవాక్స్ కొత్త టీకాను ఉత్పత్తి చేసింది.
అత్యవసర వినియోగం నిమిత్తం ఈ ఏడాది అక్టోబరులోనే డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియాకు దరఖాస్తు చేసింది.
బ్రిటన్, అమెరికాల్లో ఈ టీకాపై చేపట్టిన 2, 3 దశల క్లినికల్ పరీక్షల ఫలితాలకు సంబంధించిన డేటాను జతచేసింది. ఈ క్రమంలోనే సీడీఎస్‌సీవో నిపుణుల బృందం దీన్ని పరిశీలించి, అత్యవసర వినియోగానికి అనుమతులు మంజూరు చేస్తూ సోమవారం తాజాగా సిఫార్సు చేసింది.