సీఎం కేసీఆర్ తన కుమారుడికి పట్టాభిషేకం చేయబోతున్నారా…? ఫిబ్రవరిలో అందుకు ముహుర్తం ఫిక్స్ చేశారా…? కేసీఆర్ యాగం తర్వాత మార్పులు ఉండబోతున్నాయా…? అంటే అవుననే తెలుస్తోంది.
ఆరు సంవత్సరాలుగా సీఎంగా ఉన్న కేసీఆర్ ఇక తాను ఆ పదవి నుండి తప్పుకొని… కేటీఆర్‌ను సీఎం చేయబోతున్నారన్న వార్త ఇప్పుడు సంచలనంగా మారుతోంది. ఓ ఆంగ్లపత్రిక ఇదే కథనంపై రెండు రోజులుగా వరుస కథనాలను కూడా ప్రచురించటం, సీఎంవో వర్గాల నుండి సమాచారం అందుతోంది అని చెప్పటంతో… వార్త వైరల్ అవుతోంది.
అయితే… సీఎం కేసీఆర్ ఫిబ్రవరిలో యాగం చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఆ యాగం తర్వాత కేసీఆర్ సీఎంగా బాధ్యతల నుండి తప్పుకొని… కేటీఆర్‌ను సీఎం చేస్తారని తెలుస్తోంది. అయితే… మరీ కేసీఆర్ ఏం చేస్తారని అందిరకీ సందేహాం ఉన్నప్పటికీ, సీఎం కేసీఆర్ కంట్రోల్‌లోనే పాలన ఉండేలా చర్యలు తీసుకోబోతున్నారు.
తెలంగాణ స్టేట్ అడ్వయిజరీ కమిటీని ఏర్పాటు చేయబోతున్నారు. ఆ కమిటీ చీఫ్‌గా కేసీఆర్ ఉండబోతున్నారు. గతంలో యూపీయే హాయంలో ప్రధానిగా మన్మోహాన్ సింగ్ ఉండగా… జాతీయ సలహా సంఘం అధ్యక్షురాలిగా సోనియా ఉన్నారు. ఇప్పుడలాగే సీఎం కేసీఆర్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
ఈ కమిటీలో కేసీఆర్‌తో పాటు సీఎంగా కేటీఆర్, ముగ్గురు కీలక మంత్రులు, స్టేట్ ప్లానింగ్ కమిటీ వైస్ చైర్మన్ వినోద్ కుమార్ ఉండబోతున్నారు. ఇదే కమిటీలో కేసీఆర్ ముఖ్యసలహాదారు రాజీవ్ శర్మ కూడా ఉండే అవకాశం ఉంది. కీలకమైన పాలన వ్యవహారాల్లో ఈ కమిటీ ముఖ్యపాత్ర పోషించనుంది.