ఐటీ రంగంలో మన పోటీ బెంగళూరుతో కాదు సింగపూర్‌తో నని ఐటీ, పరిశ్రమల శాఖ కేటీఆర్ అన్నారు. కరోనా వల్ల హైదరాబాద్‌లో హైబ్రిడ్ విధానంలో పనిచేస్తున్నప్పటికీ ఫలితాల్లో మాత్రం ఎక్కడా తగ్గట్లేదని ఆయన తెలిపారు.
ఐటీ కార్యకలాపాలు కేవలం భాగ్యనగరానికే పరిమితం కాలేదని, టైర్-2 సిటిల్లోనూ ఐటీ కంపెనీలను ఏర్పాటు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. రాయదుర్గంలోని మైహోం ట్విట్జాలో కొలియర్స్, ష్యూరిఫై సంస్థల కార్యాలయాలను ఆయన మంత్రి జగదీశ్ రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కొలియర్స్ కంపెనీని కూడా టైర్-2 నగరాల్లో ఏర్పాటు చేసే విషయంపై దృష్టి సారించాలని సంస్థ ప్రతినిధులను ఆయన కోరారు. ఏడేళ్ల క్రితం ష్యూరిఫై సంస్థలో కేవలం ఒక్క ఉద్యోగి మాత్రమే ఉండేవారని, ఇప్పుడు 200 మంది వరకు ఉన్నారని వివరించారు.
అనంతరం మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ… హైదరాబాద్ ను సింగపూర్ స్థాయికి తీసుకురావడంలో మంత్రి కేటీఆర్ పాత్ర ఎంతో కీలకమని ఆయన అన్నారు. కేటీఆర్ ముందు చూపుతులో అభివృద్ధిలో హైదరాబాద్ పరుగులు పెడుతోందని కొనియాడారు .