"మేఘా" తనిఖీల్లో 78 కోట్ల నగదు... 33 కిలోల బంగారం స్వాధీనం. - it officers seize huge amount of unaccounted gold and cash in megha krishna reddy home- Tolivelugu

“మేఘా” తనిఖీల్లో 78 కోట్ల నగదు… 33 కిలోల బంగారం స్వాధీనం.

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న మేఘా కృష్ణారెడ్డి పై ఐటి దాడుల్లో కొన్ని కీలక విషయాలు తెలియవస్తున్నాయి. మేఘా కృష్ణారెడ్డి ఇంటిని, ఇంటి చుట్టుపక్కల పరిసరాలను స్వాధీనం చేసుకున్న కేంద్ర బలగాలు కృష్ణారెడ్డి ఇంటిని జల్లెడ పడుతూ కొన్ని కీలక పత్రాలతో పాటు 78 కోట్ల నగదును 33 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసున్నట్టు తెలుస్తుంది.

అంతేకాకుండా ఏపీ సీఎం జగన్ మరియు తెలంగాణ రాష్ట్రానికి చెందిన యువ నేత కేటీఆర్ మేఘా కృష్ణారెడ్డి కి కుదిరిన కొన్ని ప్రైవేట్ ఒప్పందాల డాక్యుమెంట్లు కూడా దొరికినట్లు ప్రచారం జరుగుతుంది. అసలు ఈ ఐటి రైడ్లు ఒక్కసారిగా ఇలా జరగడానికి వెనక కారణం కేంద్రంలోని ఒక కీలక నేత చక్రం తిప్పినట్లు తెలుస్తుంది.

ఇంతకాలం ప్రతి పక్ష నేత రేవంత్ రెడ్డి ఎన్ని సార్లు మేఘా కృష్ణారెడ్డి కి సంబంధించిన ఎన్నో కీలక విషయాలను చెప్పినప్పటికీ చప్పుడు చేయని కేంద్రం ఇప్పుడు ఇంత దూకుడుగా ఐటి దాడులు నిర్వహించటానికి కారణం రెండు ప్రభుత్వాలకు ప్రాణవాయువు అందిస్తున్నటువంటి మేఘా కృష్ణారెడ్డి కి కళ్లెం వేయటమే అని తెలుస్తుంది.

Share on facebook
Share on twitter
Share on whatsapp