అనుకున్నదే అయింది. మాములు లెక్కలే అన్ని అని మెఘా ఎంత మొత్తుకున్నా… కొండను తవ్వేందుకే వచ్చారు అన్నది అక్షరాలా నిజం అయింది. నాలుగురోజులుగా మెఘాపై జరిగిన ఐటీ దాడుల్లో కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఎవరెవరికి ఎంతెంత డబ్బు వెళ్లింది, ఎలా వెళ్లింది… అనే మొత్తం డాటాను సేకరించింది ఐటీ.
మెఘా కార్యాలయాలు, ఇండ్లపై జరుగుతోన్న సోదాల్లో ఆఫీసుల్లో దొరికిన అంశాలపై మెఘా కృష్ణారెడ్డి ఇంట్లో దొరికన ఆధారాలో పోల్చి చూస్తున్నారు ఐటీ అధికారులు. మొత్తం 110కోట్ల రూపాయల బంగారు, వజ్రాల అభరణాలు దొరికినట్లు తెలుస్తోంది. భారీగా ఇంట్లో ఉన్న వజ్రాలు, బంగారు అభరణాల కొన్న బిల్లుల్లో అనేక అవకతవకలు జరిగినట్లు తెలుస్తోంది. తొలివెలుగు సంపాదించిన పేమెంట్ రిసీప్ట్స్ ప్రకారం
2017 ఎప్రిల్ 1 నుండి శ్రీకృష్ణ జ్యూవెలర్స్ లో రెండు బిల్లులు
2018 మార్చి 31 నుండి మంగత్రాయ్ జ్యూవెలర్ లో రెండు బిల్లులు
2018 మార్చి 31 నుండి త్రిబువన్‌దాస్ జ్యూవెలరీ సంస్థలో జరిగిన లావాదేవీల్లో అవకతవకలపై అనేక ఆరోపణలు ఉన్నాయి.
ఈ బిల్లులు, ఇంట్రో ఉన్న టన్నుల కొద్ది అభరణాలతో పాటు… మెఘా సంస్థ ఐటీ పే చేసిన అన్ని పత్రాలను తవ్వి తీస్తున్నారు ఐటీ అధికారులు.