ఐటీ అదుపులో మెఘా కృష్ణారెడ్డి? - Tolivelugu

ఐటీ అదుపులో మెఘా కృష్ణారెడ్డి?

ప్రభుత్వాలతో అనుకూలంగా ఉండి, వేల కోట్ల ప్రాజెక్టులు కడుతూ… అవినీతి సామ్రాజ్యాన్ని విస్తరించిన మెఘాకు జైలు జీవితం తప్పేలా లేదు. వేల కోట్ల అక్రమార్జన, మనీలాండరింగ్‌పై ఐటీ సోదాల్లో పక్కా ఆధారాలు దొరికినట్లు తెలుస్తోంది. ఇప్పటికే వందల కోట్ల బంగారు వజ్రాభరణాలు సీజ్‌ చేయగా, సంచుల కొద్ది డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు ఐటీ అధికారులు.

దాదాపు 6 రోజులుగా ఇండ్లు, కార్యాలయాలు జల్లెడ పట్టిన ఐటీ అధికారులు… మెఘా కృష్ణారెడ్డిని రెండు రోజులుగా ఐటీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే ఈ మొత్తం సమాచారాన్ని, మనీలాండరింగ్ అంశాన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులకు ఐటీ అధికారులు సమాచారం అందించారు. కాస్సేపట్లో ఈడీ కూడా ఈ విచారణలో భాగం కానుందని తెలుస్తోంది.

శుక్రవారం వరకు ఈ విచారణ కొనసాగే అవకాశం ఉండగా, విచారణ పూర్తికాగానే… అరెస్ట్ చేసే అవకాశం ఉందని సమాచారం. భారీగా మనీలాండరింగ్ జరిగినట్లు ఈడీ, ఐటీకి పక్కా సమాచారం అందినట్లు తెలుస్తోంది.

భారతదేశ చరిత్రలోనే ఆరు రోజులు ఐటీ దాడులు జరగటం ఇదే ప్రథమం కావటం గమనార్హం.

Share on facebook
Share on twitter
Share on whatsapp